భూమాకు అప్పుడే బ్యాండ్ మొదలైంది
ఒక ఒరలో రెండు కత్తులు ఇముడుతాయేమో గానీ సీమ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు ఒకే పార్టీలో ఉండేందుకు మాత్రం సాధ్యం కాదు. అలాంటి చోట కూడా చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారు. బాబు పవర్ ఇంకా మూడేళ్లు ఉంది కాబట్టి టీడీపీ నేతలెవరూ ఎదురు చెప్పకపోయినా భవిష్యత్తులో వారు ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడిప్పుడే స్పష్టమవుతోంది. మంత్రి పదవి ఇస్తామన్న హామీతో టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డిపై అప్పుడే సెటైర్లు వేస్తున్నారు జిల్లా టీడీపీ నేతలు. కర్నూలు జిల్లా […]
ఒక ఒరలో రెండు కత్తులు ఇముడుతాయేమో గానీ సీమ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు ఒకే పార్టీలో ఉండేందుకు మాత్రం సాధ్యం కాదు. అలాంటి చోట కూడా చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారు. బాబు పవర్ ఇంకా మూడేళ్లు ఉంది కాబట్టి టీడీపీ నేతలెవరూ ఎదురు చెప్పకపోయినా భవిష్యత్తులో వారు ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడిప్పుడే స్పష్టమవుతోంది. మంత్రి పదవి ఇస్తామన్న హామీతో టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డిపై అప్పుడే సెటైర్లు వేస్తున్నారు జిల్లా టీడీపీ నేతలు. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి ఓ అడుగు ముందుకేసి భూమాకు మంత్రి పదవా… అంత సీన్ లేదని తేల్చేశారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తే టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు జిల్లాలో ఉన్నారని శిల్పా గుర్తు చేశారు. పవర్ మాదే భూమా వాళ్లకు ప్రోటోకాల్ మాత్రమేనని తేల్చేశారు. భూమా కుటుంబంతో తమకు రాజకీయ వైరం ఉన్న మాట కూడా వాస్తవమేనని బహిరంగంగానే చెప్పారు. శిల్పా మాటలకు జిల్లాలోని ఇతర టీడీపీ ముఖ్యుల మద్దతు కూడా ఉందని చెబుతున్నారు. భూమాకు మంత్రి పదవి రావడం జిల్లాలోని ఒక్క టీడీపీ నేతకు కూడా ఇష్టం లేదని చెబుతున్నారు. నిన్న పార్టీలో చేరిన భూమాను మంత్రిని చేస్తే తామంతా అయనకు సలామ్ కొడుతూ బతకాలా అని కొందరు నేతలు రుసరుసలాడుతున్నారు. భూమానాగిరెడ్డి తన అవసరాల కోసమే పార్టీలోకి వచ్చారు తప్పితే… ఒకవేళ భూమా చేరి ఉండకపోయినా టీడీపీ ప్రభుత్వం కూలిపోయేదా అని ప్రశ్నించారు. మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న టీడీపీ నేతలు సైతం ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ మొదలుపెట్టడంతో భూమా అనుచరులు ఆలోచనలో పడ్డారు. భూమాను అటుఇటు కాకుండా చేసే వ్యూహం కాదు కదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజులు గడిస్తే భూమాకు జరిగే మర్యాదలపై ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
Click on image to read: