ఆప‌రేష‌న్ ముద్ర‌గ‌డ ఆరంభమైందా?

కాపు ఉద్య‌మ‌నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంను టీడీపీ టార్గెట్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై క‌మిటీ వేసి ఏడు నెలల్లో నివేదిక వ‌చ్చేలా చేస్తామ‌ని, ఏటా కాపు కార్పొరేష‌న్‌కు వెయ్యి కోట్లు కేటాయిస్తామ‌న్న హామీతో ముద్ర‌గ‌డ ఆమ‌ర‌ణ దీక్ష‌ను ప్ర‌భుత్వం విరమింపజేసింది. అయితే హామీలు నిలబెట్టే దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తున్నట్టు అనిపించడం లేదు. ఏడు నెలల కాలం అంటే అదిగో ఇదిగో అంటే వచ్చేస్తుంది. అప్పుడు చంద్రబాబు మాట నిలబెట్టుకోకుంటే ముద్రగడ మళ్లీ రోడ్డెక్కడం ఖాయం. ఈ నేపథ్యంలో […]

Advertisement
Update:2016-02-25 07:56 IST

కాపు ఉద్య‌మ‌నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంను టీడీపీ టార్గెట్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై క‌మిటీ వేసి ఏడు నెలల్లో నివేదిక వ‌చ్చేలా చేస్తామ‌ని, ఏటా కాపు కార్పొరేష‌న్‌కు వెయ్యి కోట్లు కేటాయిస్తామ‌న్న హామీతో ముద్ర‌గ‌డ ఆమ‌ర‌ణ దీక్ష‌ను ప్ర‌భుత్వం విరమింపజేసింది. అయితే హామీలు నిలబెట్టే దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తున్నట్టు అనిపించడం లేదు. ఏడు నెలల కాలం అంటే అదిగో ఇదిగో అంటే వచ్చేస్తుంది. అప్పుడు చంద్రబాబు మాట నిలబెట్టుకోకుంటే ముద్రగడ మళ్లీ రోడ్డెక్కడం ఖాయం. ఈ నేపథ్యంలో టీడీపీ ఆపరేషన్ ముద్రగడను ప్రారంభించినట్టుగా భావిస్తున్నారు.

దీక్ష త‌ర్వాత కాపులు ముద్ర‌గ‌డ‌ను త‌మ ఏకైక నేత‌గా భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌కొట్టి, బ‌ల‌హీన‌ప‌రిచేందుకు టీడీపీ నేత‌లు రంగంలోకి దిగారు. ముద్ర‌గ‌డ‌ను బుజ్జ‌గించి దీక్ష విర‌మింప‌చేసిన టీడీపీ నేత‌లు ఇప్పుడు మాత్రం ముద్ర‌గ‌డ‌పై ఒంటికాలితో లేస్తున్నారు. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బుడేటి బుజ్జి విమ‌ర్శ‌ల తీవ్ర‌తే ఇందుకు నిద‌ర్శ‌నం. బుధవారం ప్రెస్ మీట్లో ముద్రగడను తిట్టిన బుడేటి.. కాపు రుణమేళ సభలో చంద్రబాబు స‌మ‌క్షంలోనే ముద్రగడపై తీవ్ర ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది.

ముద్ర‌గ‌డ ఒక్క‌డే కాపుల‌కు నాయ‌కుడా అని బుడేటి బుజ్జి ప్ర‌శ్నించారు. త‌న‌కు తాను డెడ్‌లైన్ పెట్టుకుని దీక్ష‌కు దిగిన ముద్ర‌గ‌డ అట్ట‌ర్ ప్లాప్ అయ్యార‌ని విమ‌ర్శించారు. తుని ఘ‌ట‌న‌లో ఏ1 ముద్దాయి ముద్ర‌గ‌డేన‌ని తేల్చేశారు. ప్ర‌తిపక్షాల‌తో క‌లిసి కుట్ర‌లు చేశార‌ని ఆరోపించ‌డం ద్వారా ముద్ర‌గ‌డ పోరాటం కాపుల కోసం కాదు రాజ‌కీయాల కోసం అన్న‌ట్టుగా ఎమ్మెల్యే బుజ్జీ ఆరోపించారు. కులరాజకీయాలు మానుకోవాలని ముద్రగడకు సూచించారు.

ఎమ్మెల్యే బుడేటే కాదు చాలా మంది టీడీపీ నేత‌లు ముద్ర‌గ‌డ‌పై విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టారు. అంటే మంజునాథ‌న్ క‌మిటీ గ‌డువు ముగిసే స‌రికి ముద్ర‌గ‌డ‌ను వీలైనంత బ‌ద్నామ్ చేయాల‌న్నది టీడీపీ ఎత్తుగ‌డగా భావిస్తున్నారు. ముద్ర‌గ‌డ‌కు వ్యక్తిగత రాజ‌కీయాలు అంట‌గ‌ట్ట‌డం ద్వారా కాపుల్లో పార్టీలవారిగా చీలిక తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అలా చేయ‌గ‌లిగితే కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై ఎలా ముందుకువెళ్లినా ముద్ర‌గ‌డ‌ను ఎదుర్కోవ‌డం ఈజీ అని టీడీపీ ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇలా చేయ‌డం ద్వారా కాపుల‌కు ముద్ర‌గ‌డ నాయ‌కుడ‌న్న భావ‌న‌ను తొల‌గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే మంజునాథ‌న్ క‌మిటీ నివేదిక ఎప్ప‌టికైనా రాక‌త‌ప్ప‌దు … అప్పుడు ప్రభుత్వం ఏదో ఒక నిర్ణ‌యాన్నిప్ర‌క‌టించ‌కా త‌ప్పుదు. అప్పుడు ఎవ‌రు ఎలా స్పందిస్తార‌న్న‌ది తేలుతుంది.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News