త‌ల్లికి ప్రియుడు...కూతురిపై అత్యాచారం!

దిగ‌జారిపోతున్న మాన‌వ సంబంధాల‌కు  అద్దం ప‌డుతున్న  దారుణమిది.  నైతిక విలువ‌లు, మాన‌వ సంబంధాల్లో ఒక క్ర‌మ‌బ‌ద్ధ‌త ఎందుకు అవ‌స‌ర‌మో కూడా ఈ సంఘ‌ట‌న క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చెబుతోంది. అహ్మ‌దాబాద్ జిల్లాలోని చాణ‌క్య‌పురి నివాసి అయిన ఒక‌ 17ఏళ్ల అమ్మాయి, త‌న‌పై అత్యాచారం జ‌రిగిందని సోలా పోలీస్ స్టేష‌న్లో కంప్ల‌యింట్ ఇచ్చింది. ఆ అమ్మాయి త‌ల్లితో స‌హ‌జీవ‌నం చేస్తున్న 29ఏళ్ల స‌న్నీ షా ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు.  35 ఏళ్ల పైన వ‌య‌సున్న ఆమె త‌ల్లి, ఏడేళ్ల క్రితం […]

Advertisement
Update:2016-02-24 08:39 IST

దిగ‌జారిపోతున్న మాన‌వ సంబంధాల‌కు అద్దం ప‌డుతున్న దారుణమిది. నైతిక విలువ‌లు, మాన‌వ సంబంధాల్లో ఒక క్ర‌మ‌బ‌ద్ధ‌త ఎందుకు అవ‌స‌ర‌మో కూడా ఈ సంఘ‌ట‌న క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చెబుతోంది. అహ్మ‌దాబాద్ జిల్లాలోని చాణ‌క్య‌పురి నివాసి అయిన ఒక‌ 17ఏళ్ల అమ్మాయి, త‌న‌పై అత్యాచారం జ‌రిగిందని సోలా పోలీస్ స్టేష‌న్లో కంప్ల‌యింట్ ఇచ్చింది. ఆ అమ్మాయి త‌ల్లితో స‌హ‌జీవ‌నం చేస్తున్న 29ఏళ్ల స‌న్నీ షా ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు. 35 ఏళ్ల పైన వ‌య‌సున్న ఆమె త‌ల్లి, ఏడేళ్ల క్రితం భ‌ర్త నుండి విడాకులు తీసుకుంది. ఆఫీస్‌లో ప‌రిచ‌య‌మైన‌ స‌న్నీషాతో తొమ్మిది నెల‌లుగా క‌లిసి ఉంటోంది. అత‌ను వీరి ఇంట్లోనే త‌ల్లీ కూతుళ్ల‌తో క‌లిసి ఉంటున్నాడు.

అయితే దాదాపు ఎనిమిదినెల‌లుగా స‌న్నీషా ఆ అమ్మాయిపై అకృత్యానికి పాల్ప‌డుతున్నాడు. కానీ, ఇదంతా షూట్ చేశాన‌ని, ఎవ‌రికైనా చెబితే ఫొటోలు, వీడియో బ‌య‌ట‌పెడ‌తాన‌ని, ఆమె త‌ల్లిని కూడా చంపేస్తాన‌ని బెదిరించ‌డంతో ఆ అమ్మాయి మౌనంగా భ‌రించింది. షా, ఆ అమ్మాయి క‌ద‌లిక‌ల‌పై నిఘా ఉంచేవాడు. ఎక్క‌డికీ వెళ్ల‌నిచ్చేవాడు కాదు, ఎవ‌రితోనూ మాట్లాడ‌నిచ్చేవాడు కాదు. చివ‌రికి విసిగిపోయిన బాలిక త‌న ప్రెండ్‌కి త‌న బాధ చెప్పుకోవ‌డంతో విష‌యం పోలీసుల‌కు చేరింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు స‌న్నీ షాను అరెస్టు చేసి విచార‌ణ జ‌రిపారు. పోలీసుల విచార‌ణ‌లో స‌న్నీషా త‌న త‌ప్పుని ఒప్పుకున్నాడు. అయితే అత‌ను ఇంత‌టి దారుణానికి పాల్ప‌డుతున్నాడ‌న్న సంగ‌తి కూతురు పోలీస్ కంప్ల‌యింట్ ఇచ్చేవ‌ర‌కు ఆమె త‌ల్లికి తెలియ‌దు.

 

Tags:    
Advertisement

Similar News