చింతమనేని దాడుల జాబితాలో మరొకటి

టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ దౌర్జ‌న్యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. తాజాగా నీటిపారుద‌ల శాఖ అధికారుల‌పై చింత‌మ‌నేని దాడికి తెగ‌బ‌డ్డారు. చొక్కా కాల‌ర్ ప‌ట్టుకుని అధికారిని ఈడ్చి కొట్టారు. ప‌శ్చిగోదావ‌రి జిల్లా ఏలూరు స‌మీపంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కృష్ణా డెల్టాలో 60 వేల ఎకరాల సాగు కోసం గోదావరి జలాలను మోటార్ల ద్వారా తోడే ప‌క్రియ డిసెంబ‌ర్ నుంచి కొన‌సాగుతుండ‌గా.. నీటి నిల్వ‌లు త‌గ్గిపోవ‌డంతో పంపింగ్‌ను ఆపేశారు. దీంతో మోటార్లు కొద్దికాలంగా నిరుప‌యోగంగా ఉన్నాయి. ఈ […]

Advertisement
Update:2016-02-24 07:23 IST

టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ దౌర్జ‌న్యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. తాజాగా నీటిపారుద‌ల శాఖ అధికారుల‌పై చింత‌మ‌నేని దాడికి తెగ‌బ‌డ్డారు. చొక్కా కాల‌ర్ ప‌ట్టుకుని అధికారిని ఈడ్చి కొట్టారు. ప‌శ్చిగోదావ‌రి జిల్లా ఏలూరు స‌మీపంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కృష్ణా డెల్టాలో 60 వేల ఎకరాల సాగు కోసం గోదావరి జలాలను మోటార్ల ద్వారా తోడే ప‌క్రియ డిసెంబ‌ర్ నుంచి కొన‌సాగుతుండ‌గా.. నీటి నిల్వ‌లు త‌గ్గిపోవ‌డంతో పంపింగ్‌ను ఆపేశారు. దీంతో మోటార్లు కొద్దికాలంగా నిరుప‌యోగంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో వాటిని తీసుకెళ్లేందుకు చింత‌మ‌నేని త‌న అనుచ‌రుల‌తో క‌లిసి అక్క‌డికి వ‌చ్చారు.

జేసీబీల సాయంతో మోటార్లు, వైర్లు తొల‌గించేందుకు ప్ర‌య‌త్నించారు. ఈస‌మ‌యంలో వైర్లు దెబ్బ‌తిన్నాయి. అయితే ఇందుకు అధికారుల నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మంటూ చింత‌మ‌నేని రెచ్చిపోయారు. అక్క‌డే ఉన్న అసిస్టెంట్ ఇంజ‌నీర్ హుస్సేన్ ను కాల‌ర్ ప‌ట్టుకుని ఈడ్చిపాడేశారు. దాడిని అడ్డుకునేందుకు ఆఫీస్ అసిస్టెంట్ గ‌ణేష్ ప్ర‌య‌త్నించ‌గా అత‌డిపైనా దాడికి తెగ‌బెట్టారు. దీంతో మిగిలిన సిబ్బంది భ‌య‌ప‌డిపోయారు. జేసీబీతో త‌వ్వ‌డం వ‌ల్లే వైర్లు దెబ్బ‌తిన్నాయ‌ని కానీ అందుకు తామే కార‌ణ‌మంటూ దాడి చేశార‌ని సిబ్బంది ఆవేద‌న చెందారు. అయితే చింత‌మనేనితో గొడ‌వెందుకన్న భావ‌న‌తో హుస్సేన్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. జ‌రిగిందేదో జ‌రిగింది…. వదిలేయండి అని మీడియాను హుస్సేనే కోర‌డం విశేషం.

చింత‌మనేని ఇలా దాడుల‌కు తెగ‌బ‌డ‌డం ఇదేమీ కొత్త‌కాదు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి త‌రచూ ఏదో ఒక అధికారిని కొడుతూనే ఉన్నారు. ఇసుక అక్ర‌మ ర‌వాణా అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన త‌హ‌సీల్దార్ వ‌న‌జాక్షిని ఇసుక‌లో ప‌డేసి కొట్టారు. ఈ ఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. కానీ చంద్ర‌బాబు త‌ప్పంతా వ‌న‌జాక్షిదేనంటూ చింత‌మనేనిని వెనుకేసుకొచ్చారు. అప్ప‌టి నుంచి చింత‌మ‌నేని మ‌రింత రెచ్చిపోతున్నారు. అడ‌విలో అక్ర‌మంగా రోడ్డు వేయ‌డాన్ని అడ్డుకున్న అట‌వీ సిబ్బందిని కొట్టారు.

జీతాలు పెంచేలా చూడాల‌ని విన‌తిప‌త్రం ఇచ్చేందుకు వెళ్లిన అంగ‌న్ వాడీ మ‌హిళ‌ల‌ను ప‌చ్చిబూతులు తిట్టి పంపించారు. కోడి గుడ్లు అమ్ముకునే మీకెందుకే జీతాలు అంటూ దారుణంగా కించ‌ప‌రిచారు చింత‌మనేని. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని ఒక ఆల‌యానికి సంబంధించిన భూముల్లో చేప‌ల చెరువు పెంప‌కం లీజు విష‌యంలోనూ చింత‌మ‌నేని అనుచ‌రులు దౌర్జన్యానికి పాల్ప‌డ్డారు. వేలం పాట‌కు వ‌చ్చిన వారిని బెదిరించి అతి త‌క్కువ ధ‌ర‌కు భూముల లీజును సొంతం చేసుకున్నారు. అయితే చింత‌మనేనిపై చంద్ర‌బాబు గానీ… ఇత‌ర ఉన్న‌తాధికారులుగానీ ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకున్న పాపాన పోలేదు. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నిచేయాలంటేనే అధికారులు బిక్కుబిక్కుమంటూ బ‌తుకుతున్నారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News