చేసింది వెధ‌వ ప‌ని... మ‌ళ్లీ లాజిక్కు ఒక్క‌టా " జ‌గ‌న్‌

వైసీపీ ఎమ్మెల్యేల‌ను టీడీపీలో చేర్చుకున్న చంద్ర‌బాబుపై వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుకు అసలు సిగ్గుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిందే వెధవ పని పైగా కొత్త లాజిక్కులను అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారని జగన్ మండిపడ్డారు. జగన్ ప్రభుత్వాన్ని పడగొడుతానని చెప్పాడు కాబట్టే తాను ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నా అని చంద్రబాబు వెధవ లాజిక్కు చెబుతున్నారని విమర్శించారు. అసలు తాను ఆ రోజు ఏం చెప్పానో  వీడియో టేపులు బయటకు తీసి మరోసారి చూడాలన్నారు. ప్రభుత్వాన్ని […]

Advertisement
Update:2016-02-23 14:23 IST

వైసీపీ ఎమ్మెల్యేల‌ను టీడీపీలో చేర్చుకున్న చంద్ర‌బాబుపై వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుకు అసలు సిగ్గుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిందే వెధవ పని పైగా కొత్త లాజిక్కులను అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారని జగన్ మండిపడ్డారు. జగన్ ప్రభుత్వాన్ని పడగొడుతానని చెప్పాడు కాబట్టే తాను ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నా అని చంద్రబాబు వెధవ లాజిక్కు చెబుతున్నారని విమర్శించారు.

అసలు తాను ఆ రోజు ఏం చెప్పానో వీడియో టేపులు బయటకు తీసి మరోసారి చూడాలన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే బలం తనకు లేదని… 21 మంది ఎమ్మెల్యేలు వస్తే గంటలోనే ప్రభుత్వం పడిపోతుందని తానన్నట్టు జగన్ చెప్పారు. కానీ అనుకూల మీడియా ద్వారా వక్రీకరించి ప్రచారం చేస్తోందని జగన్ మండిపడ్డారు. చంద్రబాబుకు తనకు ఒక తేడా ఉందని జగన్ చెప్పారు.

చంద్రబాబు జీవితం మొత్తం అడ్డదారిలో ఎమ్మెల్యేలను చేర్చుకుని రాజకీయాలు నడుపుతున్నారన్నారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడవడం నుంచి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వరకు అదే చేస్తున్నారని అన్నారు. తాను మాత్రం అలా ఎప్పుడూ చేయలేదన్నారు. గతంలో ఇతర పార్టీ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్నా వెంటనే వారితో రాజీనామా చేయించి జనంలోకి వెళ్లామని చెప్పారు. చంద్రబాబును మించి… నీచ రాజకీయాలు చేసేవాడు దేశంలో ఎక్కడా లేరన్నారు. కనీసం తాను చేసిన పనిని బయటకు వచ్చి సమర్థించుకునే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుకు ఇంకా అధికారం మూడేళ్లు ఉందన్న ఉద్దేశంతోనే చాలా మంది సర్దుకుపోతున్నారని అన్నారు. చంద్రబాబు పాలన ఏడాదిలోకి పడితే అప్పుడు టీడీపీ నుంచి నేతలు బయటకు క్యూ కడుతారన్నారు. రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు ఎందుకు అత్యుత్సాహంతో పనిచేస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు జగన్. నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు వస్తే ఎవరేంటో ప్రజలే తేలుస్తారని అన్నారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News