భూమా నా సొంత మనిషి అనుకున్నా...
వైసీపీ ఎమ్మెల్యేలు నలుగురు టీడీపీలో చేరడంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ ఢిల్లీలో స్పందించారు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా నిస్సిగ్గుగా చేస్తున్న పనులు చూస్తుంటే బాధాకరంగా ఉందన్నారు. కోట్ల రూపాయలు, మంత్రి పదవులు ఆశ చూపి పట్టపగలు నలుగురు ఎమ్మెల్యేలను లొంగదీసుకున్నారని విమర్శించారు. బాగా దగ్గరి మనుషులను… కుటుంబసభ్యులనుకున్న వారిని కూడా ప్రలోభపెట్టడం బాధగా అనిపించందన్నారు. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి అన్న విషయంలో చాలా బాధ అనిపించిందన్నారు. నాగిరెడ్డి అన్నను సొంత మనిషిగా… కుటుంబసభ్యుడిగా భావించానన్నారు. ఆయనకు కూడా మంత్రి పదవులు ఆశచూపి […]
వైసీపీ ఎమ్మెల్యేలు నలుగురు టీడీపీలో చేరడంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ ఢిల్లీలో స్పందించారు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా నిస్సిగ్గుగా చేస్తున్న పనులు చూస్తుంటే బాధాకరంగా ఉందన్నారు. కోట్ల రూపాయలు, మంత్రి పదవులు ఆశ చూపి పట్టపగలు నలుగురు ఎమ్మెల్యేలను లొంగదీసుకున్నారని విమర్శించారు.
బాగా దగ్గరి మనుషులను… కుటుంబసభ్యులనుకున్న వారిని కూడా ప్రలోభపెట్టడం బాధగా అనిపించందన్నారు. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి అన్న విషయంలో చాలా బాధ అనిపించిందన్నారు. నాగిరెడ్డి అన్నను సొంత మనిషిగా… కుటుంబసభ్యుడిగా భావించానన్నారు. ఆయనకు కూడా మంత్రి పదవులు ఆశచూపి చంద్రబాబు తీసుకున్నారని అన్నారు. శోభమ్మ చనిపోయినప్పుడు తమ కుటుంబం నుంచి విజయమ్మ, భారతి, షర్మిలా అందరం వెళ్లి అక్కడే ఉన్నామని గుర్తు చేశారు. భూమాను కుటుంబసభ్యుడిగా తామంతా భావించామన్నారు. పార్టీని మారిన వారు గుండెలపై చేయివేసుకుని మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలన్నారు.
చంద్రబాబు తనను తప్ప మిగిలిన ఎమ్మెల్యేలందరితోనూ చర్చలు జరిపారని కానీ నలుగురిని మాత్రమే తీసుకోగలిగారని అన్నారు. చంద్రబాబు ఇంత కష్టపడినా, అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేయించినా కేవలం నలుగురిని మాత్రమే లాక్కోగలిగారన్నారు. మిగిలిన 62 మంది ఎమ్మెల్యేలకు తాను హ్యాట్సాఫ్ చెబుతున్నానన్నారు. ఇంతగా కోట్ల రూపాయలు, మంత్రి పదవులు ఆశచూపినా వెళ్లకుండా ప్రజల పక్షాన నిలబడిన ఎమ్మెల్యేను చూపి గర్వపడుతున్నామన్నారు.
Click on image to read: