క‌న్న తండ్రే క‌త్తితో పొడిచి చంపాడు!

పోషించ‌లేనేమో అనే భ‌యంతో ఒక తండ్రి త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను క‌ర్క‌శంగా హ‌త్య‌చేశాడు. వివ‌రాల్లోకి వెళితే- బెంగ‌ళూరులోని ప్ర‌ముఖ షాపింగ్ ప్రాంత‌మైన చిక్‌పేట‌లో శివ‌కుమార్ అనే వ్య‌క్తి గ‌న్నీబ్యాగుల షాపులో ప‌నిచేస్తున్నాడు. అత‌నికి ఇద్ద‌రు పిల్ల‌లు. తొమ్మిదేళ్ల ప‌వ‌న్ కుమార్‌, ఆరేళ్ల సించ‌న‌. శివ‌కుమార్ భార్య వ‌సంత ఇళ్ల‌లో ప‌నిచేస్తూ భ‌ర్త‌కు ఆర్థికంగా తోడ్ప‌డుతోంది. శుక్ర‌వారం వ‌సంత ప‌నిలోకి వెళ్ల‌గా శివ‌కుమార్ ఇంట్లోనే ఉన్నాడు. పిల్ల‌ల‌ను హ‌త్య‌చేయాల‌నే ఉద్దేశంతోనే వారిని స్కూలుకి వెళ్ల‌కుండా ఆపాడు. త‌రువాత పిల్ల‌లిద్ద‌రినీ […]

Advertisement
Update:2016-02-23 12:29 IST

పోషించ‌లేనేమో అనే భ‌యంతో ఒక తండ్రి త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను క‌ర్క‌శంగా హ‌త్య‌చేశాడు. వివ‌రాల్లోకి వెళితే-

బెంగ‌ళూరులోని ప్ర‌ముఖ షాపింగ్ ప్రాంత‌మైన చిక్‌పేట‌లో శివ‌కుమార్ అనే వ్య‌క్తి గ‌న్నీబ్యాగుల షాపులో ప‌నిచేస్తున్నాడు. అత‌నికి ఇద్ద‌రు పిల్ల‌లు. తొమ్మిదేళ్ల ప‌వ‌న్ కుమార్‌, ఆరేళ్ల సించ‌న‌. శివ‌కుమార్ భార్య వ‌సంత ఇళ్ల‌లో ప‌నిచేస్తూ భ‌ర్త‌కు ఆర్థికంగా తోడ్ప‌డుతోంది. శుక్ర‌వారం వ‌సంత ప‌నిలోకి వెళ్ల‌గా శివ‌కుమార్ ఇంట్లోనే ఉన్నాడు. పిల్ల‌ల‌ను హ‌త్య‌చేయాల‌నే ఉద్దేశంతోనే వారిని స్కూలుకి వెళ్ల‌కుండా ఆపాడు. త‌రువాత పిల్ల‌లిద్ద‌రినీ క‌త్తితో పొడిచి చంపేశాడు. శ‌వాల‌ను గోతాముల్లో వేసి ఓ డ్రేనేజిలో ప‌డేశాడు.

భార్య‌కు, పిల్ల‌ల‌ను తీసుకుని ధ‌ర్మ‌శాల‌కు వెళ‌తాన‌ని చెప్పి ఉండ‌టంతో ఆమె, భ‌ర్త పిల్ల‌లు ఇంటికి తిరిగివ‌స్తార‌ని ఎదురుచూస్తోంది. కానీ శివ‌కుమార్ చామ‌రాజ‌న‌గ‌ర్‌లో ఉన్న మ‌హ‌దేశ్వ‌ర హిల్స్‌కి వెళ్లి ఆదివారం తిరిగి ఇంటికి వ‌చ్చాడు. అయితే ఇంటికి వ‌చ్చాక అత‌ను త‌న స‌మీప బంధువుల‌కు త‌న కిరాత‌కం గురించి చెప్పేశాడు. ఆ బంధువులు పోలీసు కంప్ల‌యింట్ ఇవ్వ‌డంతో పోలీసులు శివ‌కుమార్‌ని అరెస్టు చేశారు. పిల్ల‌ల శ‌వాల‌ను వెలికితీసి పోస్ట్ మార్ట‌మ్ చేయించారు. శివ‌కుమార్‌కి మాన‌సిక స‌మ‌స్య‌లు ఏమీ లేవ‌ని అత‌ను మాన‌సికంగా ఆరోగ్యంగానే ఉన్నాడ‌ని, ఆర్థిక‌ ప‌రిస్థితుల‌కు భ‌య‌ప‌డే ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడ‌ని అత‌ని బంధువులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News