వర్కింగ్ ఉమెన్ కోసం...ఈ చిట్కాలు!
కొన్ని అలవాట్లు, రోజువారీ మామూలుగా చేసుకుపోయే పనులు దీర్ఘకాలంలో మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. అలాంటి వాటిపట్ల కాస్త అవగాహన పెంచుకుంటే ఆ సమస్యలు రాకుండా నివారించవచ్చు. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇవి- రోజూ ఆఫీసులకు వెళ్లేవారు ఒక భుజానికే బ్యాగుని తగిలించుకుంటూ ఉంటారు. అలాకాకుండా రెండు భుజాలకు సమానంగా మార్చుకుంటూ తగిలించుకోవడం మంచిది. లేకపోతే ఆ ఒక్కవైపు కండరాలు, జాయింట్లమీద ఒత్తిడి పడుతుంది. అది నొప్పులకు దారితీయవచ్చు. ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు కుడివైపు […]
కొన్ని అలవాట్లు, రోజువారీ మామూలుగా చేసుకుపోయే పనులు దీర్ఘకాలంలో మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. అలాంటి వాటిపట్ల కాస్త అవగాహన పెంచుకుంటే ఆ సమస్యలు రాకుండా నివారించవచ్చు. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇవి-
- రోజూ ఆఫీసులకు వెళ్లేవారు ఒక భుజానికే బ్యాగుని తగిలించుకుంటూ ఉంటారు. అలాకాకుండా రెండు భుజాలకు సమానంగా మార్చుకుంటూ తగిలించుకోవడం మంచిది. లేకపోతే ఆ ఒక్కవైపు కండరాలు, జాయింట్లమీద ఒత్తిడి పడుతుంది. అది నొప్పులకు దారితీయవచ్చు. ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు కుడివైపు భుజానికి, ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఎడమభుజానికి తగిలించుకోవాలనే నియమం పెట్టుకుంటే సరిపోతుంది.
- ఫోనుతో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ఒకే చెవితో మాట్లాడే అలవాటు ఉంటే దాన్ని మార్చుకుంటే మంచిది. లేకపోతే తలని వాల్చి మాట్లాడుతుంటే ఆ వైపు భుజం, మెడ కండరాలు ఒత్తిడికి గురవుతాయి.
- రోజంతా హీల్స్ వేసుకుని నడిచే అలవాటు ఉంటుంది కొందరికి. ఇలా నిరంతరం హీల్స్ వాడుతుంటే శరీరం కనిపించే తీరు దెబ్బతింటుంది. నిటారుగా సౌకర్యంగా ఉండలేరు. మోకాళ్ల కింది భాగం ఒత్తిడికి గురవుతుంది. హీల్స్ అలవాటు ఎంతగా ఉన్నా ఫ్లాట్స్‌ని కూడా కలిపి వాడడం మేలు.
- బస్టాపుల్లో, ఆఫీసుల్లో నిలబడుతున్నపుడు, ఆఫీసులో కూర్చుని పనిచేస్తున్నప్పుడు శరీరంలో ఒకవైపే భారం మోపుతున్నారేమో గమనించండి. శరీరం రెండువైపులా సమానంగా భారం పడేలా చూసుకోవాలి.