బాబు బాధితుల జాబితాలో మ‌రో ఐఏఎస్

ఏపీలో ఉన్న‌తాధికారుల ప‌రిస్థితి ముందునొయ్యి వెనుక గొయ్యి త‌ర‌హాలో త‌యారైంది. ప్ర‌భుత్వ పెద్ద‌లు చెప్పిన‌ట్టు వింటే భ‌విష్య‌త్తులో చిక్కులు… విన‌క‌పోతే ఇప్పుడే తిప్ప‌లు అన్న‌ట్టుగా ప‌రిస్థితి ఉంది. తాజాగా ప్ర‌భుత్వానికి నిబంధ‌న‌ల‌ను గుర్తు చేసిన సీనియ‌ర్ అధికారిపై ఏపీ ప్ర‌భుత్వం వేటు వేసింది. ఏపీ రాజ‌ధాని న‌గ‌ర అభివృద్ధి, యాజ‌మాన్య సంస్థ చైర్మ‌న్ అజ‌య్ జైన్‌పై ప్ర‌భుత్వం బ‌దిలీ వేటు వేసింది. రాజ‌ధాని నిర్మాణ మాస్ట‌ర్ డెవ‌ల‌ప‌ర్ ఎంపిక‌లో నిబంధ‌న‌లను గుర్తు చేయ‌డమే అజ‌య్ జైన్ చేసిన […]

Advertisement
Update:2016-02-22 06:03 IST

ఏపీలో ఉన్న‌తాధికారుల ప‌రిస్థితి ముందునొయ్యి వెనుక గొయ్యి త‌ర‌హాలో త‌యారైంది. ప్ర‌భుత్వ పెద్ద‌లు చెప్పిన‌ట్టు వింటే భ‌విష్య‌త్తులో చిక్కులు… విన‌క‌పోతే ఇప్పుడే తిప్ప‌లు అన్న‌ట్టుగా ప‌రిస్థితి ఉంది. తాజాగా ప్ర‌భుత్వానికి నిబంధ‌న‌ల‌ను గుర్తు చేసిన సీనియ‌ర్ అధికారిపై ఏపీ ప్ర‌భుత్వం వేటు వేసింది. ఏపీ రాజ‌ధాని న‌గ‌ర అభివృద్ధి, యాజ‌మాన్య సంస్థ చైర్మ‌న్ అజ‌య్ జైన్‌పై ప్ర‌భుత్వం బ‌దిలీ వేటు వేసింది.

రాజ‌ధాని నిర్మాణ మాస్ట‌ర్ డెవ‌ల‌ప‌ర్ ఎంపిక‌లో నిబంధ‌న‌లను గుర్తు చేయ‌డమే అజ‌య్ జైన్ చేసిన నేరం. స్విస్ చాలెంజ్లో మాస్ట‌ర్ డెవ‌ల‌ప‌ర్‌ను ఎంపిక చేయాల‌ని నిర్ణ‌యించిన ప్ర‌భుత్వం అందుకు త‌గ్గ‌ట్టు ఏర్పాట్లు చేయాల‌ని అజ‌య్ జైన్‌ను ప్ర‌భుత్వం ఆదేశించింది. అయితే స్విస్ చాలెంజ్ విధివిధానాల ఏర్పాటులో సుప్రీం కోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ముందుకెళ్లేందుకు అజ‌య్ జైన్ సిద్ధ‌మ‌వ‌డంతో పెద్దలకు కోపం వ‌చ్చింద‌ని చెబుతున్నారు.

మ‌హారాష్ట‌లోని థానేలో స్విస్ చాలెంజ్ పద్ద‌తిలో గృహాల నిర్మాణానికి కాంట్రాక్ట్ ఎంపిక కేసులో సుప్రీం కోర్టు కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. వాటి ఆధారంగా ముందుకెళ్లాల‌ని అజ‌య్ జైన్ ప్ర‌య‌త్నించారు. దీంతో ఆయ‌న‌పై వేటు వేశారు. అజ‌య్ జైన్‌ను అప్రాధాన్య‌త పోస్టుకు పంపే అవ‌కాశాలున్నాయి. సీసీడీఎంసీ చైర్ ప‌ర్స‌న్‌గా రిటైర్డ్ ఐఏఎస్ శ్రీల‌క్ష్మి పార్థసార‌థిని నియ‌మించారు. అయితే ఈ అధికారిణిని ఏరికోరి ప్ర‌భుత్వ పెద్ద‌లు ఎంపిక చేశార‌ని వార్త‌లొస్తున్నాయి. త‌న‌ను సీసీడీఎంసీ చైర్ ప‌ర్స‌న్‌గా నియ‌మించాల‌ని ఆమె చేత ప్ర‌భుత్వ‌మే లేఖ‌రాయించి ఆమోదించిన‌ట్టు చెబుతున్నారు.

ఇప్ప‌టికే సీఆర్‌డీఏ వ్య‌వ‌హారాలకు అడ్డుత‌గులుతున్నార‌న్న ఉద్దేశంతో పుర‌పాల‌న ప‌ట్టాణాభివృద్ది శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ గిరిధ‌ర్‌ను, త‌న వియంకుడి బంధువు మెడిక‌ల్ కాలేజ్ వ్య‌వ‌హారంలో సానుకూలంగా స్పందించ‌లేద‌న్న కోపంతో వైద్య ఆరోగ్య‌శాఖ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ సుబ్ర‌మ‌ణ్యంను అప్రాధాన్య‌త శాఖ‌లకు పంపించార‌ని ఐఏఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

Click on image to read:

 

Tags:    
Advertisement

Similar News