కడపలో వైసీపీకి మరో దెబ్బ- రంగంలోకి నేతలు
టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను ఎమ్మెల్యేలకే కాకుండా చిన్నచిన్న నేతలకు టీడీపీ వర్తింపజేస్తోంది. తాజాగా జగన్ సొంత జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకులపై లోకేష్ బ్యాచ్ వలవేస్తోంది. కడప కార్పొరేషన్‌పై కన్నేసింది సైకిల్ పార్టీ. కడప డిప్యూటీ మేయర్‌గా ఉన్న ఆరీపుల్లా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. జిల్లాకు చెందిన టీడీపీ నేత సతీష్ రెడ్డితో పాటు పలువురితో ఆయన చర్చలు జరిపారు. ఈనెల 24న లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టు ఆరీపుల్లా ప్రకటించారు. ఆయనతో పాటు మరో 10 […]
టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను ఎమ్మెల్యేలకే కాకుండా చిన్నచిన్న నేతలకు టీడీపీ వర్తింపజేస్తోంది. తాజాగా జగన్ సొంత జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకులపై లోకేష్ బ్యాచ్ వలవేస్తోంది. కడప కార్పొరేషన్‌పై కన్నేసింది సైకిల్ పార్టీ.
కడప డిప్యూటీ మేయర్‌గా ఉన్న ఆరీపుల్లా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. జిల్లాకు చెందిన టీడీపీ నేత సతీష్ రెడ్డితో పాటు పలువురితో ఆయన చర్చలు జరిపారు. ఈనెల 24న లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టు ఆరీపుల్లా ప్రకటించారు. ఆయనతో పాటు మరో 10 మంది వరకు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారట. కడప కార్పొరేషన్‌లో 42 మంది కార్పొరేటర్లు వైసీపీ తరపున విజయం సాధించారు. టీడీపీ తరపున 8 మంది గెలిచారు. కార్పొరేటర్లను చేర్చుకోవడం ద్వారా మేయర్ స్థానంపై టీడీపీ కన్నేసిందని అనుమానిస్తున్నారు.
ఆరీపుల్లాతో పాటు కార్పొరేటర్లు పార్టీ వీడుతున్నారన్న సమాచారంతో వైసీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబులు ఆయనతో చర్చలు జరిపారు. పార్టీ వీడవద్దని సూచించారు. అయితే కడప డిప్యూటీ మేయర్ పార్టీ వీడడం దాదాపు ఖాయమని చెబుతున్నారు. కడప ఎమ్మెల్యే అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబు తీరు వల్లే తాను పార్టీ వీడుతున్నట్టు కడప డిప్యూటీ మేయర్ మీడియాతో చెప్పారు.
Click on image to read: