యాంటీ బ‌యోటెక్స్‌...మెద‌డుకి యాంటీ!

ప్రాణాంత‌క‌మైన బ్యాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్ల‌కు విరుగుడుగా ప‌నిచేసే యాంటీ బ‌యోటెక్స్ మందులు మ‌న మెద‌డుకి హాని క‌లిగిస్తాయ‌ని అమెరికా ప‌రిశోధ‌కులు అంటున్నారు.  ఇవి అనారోగ్యాల‌ను త‌గ్గించినా త‌రువాత మెద‌డుపై నెగెటివ్ ప్ర‌భావాన్ని కలుగ‌జేస్తాయ‌ని, డెరీలియం ఇత‌ర మెద‌డు సంబంధిత అనారోగ్యాలను తెచ్చిపెడ‌తాయ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. మాన‌సిక గంద‌ర‌గోళం, భ్ర‌మ‌, భ్రాంతులు త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌తో కూడుకున్న డెరీలియం మెద‌డు ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తుంది. తీవ్ర‌మైన అనారోగ్యాల త‌రువాత హాయిగా ఇంటికి వెళ్లాల్సిన పేషంట్లు డెరీలియం కార‌ణంగా మళ్లీ న‌ర్సింగ్‌హోముల‌కు వెళుతున్నార‌ని అమెరికా […]

Advertisement
Update:2016-02-22 06:18 IST

ప్రాణాంత‌క‌మైన బ్యాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్ల‌కు విరుగుడుగా ప‌నిచేసే యాంటీ బ‌యోటెక్స్ మందులు మ‌న మెద‌డుకి హాని క‌లిగిస్తాయ‌ని అమెరికా ప‌రిశోధ‌కులు అంటున్నారు. ఇవి అనారోగ్యాల‌ను త‌గ్గించినా త‌రువాత మెద‌డుపై నెగెటివ్ ప్ర‌భావాన్ని కలుగ‌జేస్తాయ‌ని, డెరీలియం ఇత‌ర మెద‌డు సంబంధిత అనారోగ్యాలను తెచ్చిపెడ‌తాయ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. మాన‌సిక గంద‌ర‌గోళం, భ్ర‌మ‌, భ్రాంతులు త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌తో కూడుకున్న డెరీలియం మెద‌డు ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తుంది.

తీవ్ర‌మైన అనారోగ్యాల త‌రువాత హాయిగా ఇంటికి వెళ్లాల్సిన పేషంట్లు డెరీలియం కార‌ణంగా మళ్లీ న‌ర్సింగ్‌హోముల‌కు వెళుతున్నార‌ని అమెరికా బ్రిగ్‌హామ్‌, బోస్ట‌న్ల ఆసుప‌త్రుల‌కు చెందిన డాక్ట‌ర్లు చెబుతున్నారు. తీవ్ర అనారోగ్యాల నుండి కోలుకున్నాక డెరీలియం బారిన ప‌డిన‌వారు, అలాంటి స‌మ‌స్య‌లు లేనివారికంటే త్వ‌ర‌గా మ‌ర‌ణిస్తున్న‌ట్టు కూడా వైద్యులు ప‌రిశోధ‌న‌ల్లో గుర్తించారు. 12జాతుల‌కు చెందిన 54ర‌కాల యాంటీ బ‌యోటిక్స్, అత్యంత స‌ర్వ‌సాధార‌ణంగా ఉప‌యోగించే పెన్సిలిన్ లాంటివే ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తున్నాయ‌ని వారు చెబుతున్నారు.

యాంటీ బ‌యోటెక్స్ వాడిన‌వారిలో 47శాతం మంది భ్ర‌మ‌లు, భ్రాంతుల‌కు గురవుతున్నార‌ని, డెరీలియంకి లోన‌వుతున్న‌ వారిలో 25శాతం మంది కిడ్నీవైఫ‌ల్యం బారిన‌ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. పైగా మెద‌డుపై నెగెటివ్ ప్రభావం ఆ మందుల‌ను మొద‌లుపెట్టిన చాలాకాలం త‌రువాత బ‌య‌ట‌ప‌డుతున్న‌ట్టుగా, వాటిని ఆపేసిన చాలాకాలం త‌రువాత త‌గ్గుతున్న‌ట్టుగా కూడా గుర్తించారు.

శాస్త్ర‌వేత్త‌లు ఈ విష‌యంపై త‌మ‌వ‌ద్ద ఉన్న అన్ని శాస్త్రీయ నివేదిక‌ల‌తో పాటు, యాంటీబ‌యోటెక్స్ వాడాక డెరీలియంకి గుర‌యిన‌ 391మంది పేషంట్ల కేసు రిపోర్టుల‌ను స‌మీక్షించి ఈ స‌మాచారాన్ని వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News