పార్టీ మార‌డంపై తేల్చేసిన ఎస్వీ మోహ‌న్ రెడ్డి

తాను వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్తున్న‌ట్టు జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని క‌ర్నూలు వైసీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డి ఖండించారు. ఒక టీవీ చాన‌ల్‌లో మాట్లాడిన ఆయ‌న … చాన‌ళ్లు ఊహించుకుని ఊహాగానాలు ప్ర‌సారం చేస్తున్నాయ‌న్నారు. జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేల‌తోనూ మాట్లాడాన‌ని ఎవ‌రికీ పార్టీ మారే ఆలోచ‌న లేద‌న్నారు. టీడీపీలోకి వెళ్లినా వ‌చ్చే లాభం ఏమీ ఉండదన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలే ప‌నులు జ‌ర‌గ‌డం లేదు, నిధులు మంజూరు కావ‌డం లేద‌ని బాధ‌ప‌డుతున్నార‌ని ఎస్వీ మోహ‌న్ రెడ్డి చెప్పారు. త‌న […]

Advertisement
Update:2016-02-19 13:46 IST

తాను వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్తున్న‌ట్టు జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని క‌ర్నూలు వైసీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డి ఖండించారు. ఒక టీవీ చాన‌ల్‌లో మాట్లాడిన ఆయ‌న … చాన‌ళ్లు ఊహించుకుని ఊహాగానాలు ప్ర‌సారం చేస్తున్నాయ‌న్నారు. జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేల‌తోనూ మాట్లాడాన‌ని ఎవ‌రికీ పార్టీ మారే ఆలోచ‌న లేద‌న్నారు.

టీడీపీలోకి వెళ్లినా వ‌చ్చే లాభం ఏమీ ఉండదన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలే ప‌నులు జ‌ర‌గ‌డం లేదు, నిధులు మంజూరు కావ‌డం లేద‌ని బాధ‌ప‌డుతున్నార‌ని ఎస్వీ మోహ‌న్ రెడ్డి చెప్పారు. త‌న వ‌ర‌కు అయితే పార్టీ మారే ఆలోచ‌నే లేద‌న్నారు. భూమా నాగిరెడ్డి గురించి త‌న‌కు తెలియ‌ద‌ని… ఆయ‌న కూడా పార్టీ మారుతార‌ని తాను అనుకోవ‌డం లేద‌న్నారు. భూమాకు మంత్రి ప‌ద‌విని ఆఫ‌ర్ చేశార‌న్న వార్త‌ల‌పైనా ఎస్వీ మోహ‌న్ రెడ్డి స్పందించారు.

చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వి ఇస్తారా, డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇస్తారా లేక ఏకంగా ఆయ‌న కుర్చీనే భూమాకు ఇస్తారా అన్న‌ది ఊహాగానాలేన‌ని అన్నారు. త‌న‌ను కూడా సంప్ర‌దించ‌కుండా పార్టీ మారుతున్న వారి జాబితాలో త‌న పేరు కూడా వేయ‌డం స‌రికాద‌న్నారు. జిల్లా నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ‌రూ పార్టీ మారే అవ‌కాశం లేద‌న్నారు మోహ‌న్ రెడ్డి.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News