మొక్కే క‌దా అని పీకేశారు... మ్యాట‌ర్ మంత్రి Vs టీడీపీ అయింది

సిల్లీ విషయాల్లో కూడా ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని నవ్వులపాలవుతున్నారు. ఇలాంటి ఘటనే పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.  ఒకరి ఇంటి ముందు ఉన్న మొక్కను మరొకరు పీకివేడయంతో వివాదం చేలరేగి అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి,  ఆ తర్వాత మంత్రిగారి రంగ ప్రవేశం దాకా వెళ్లింది. మంత్రిగారికి పోటీగా టీడీపీ నేతలు సీన్ లోకి వచ్చారు. మధ్యలో పోలీసులు నవ్వాలో ఏడవాలో తెలియక తలలుపట్టుకుంటున్నారు. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో పుల్లా శ్రీనివాస్, తమ్మబత్తుల ధనరాజు ఇళ్లు పక్కపక్కనే […]

Advertisement
Update:2016-02-17 06:30 IST

సిల్లీ విషయాల్లో కూడా ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని నవ్వులపాలవుతున్నారు. ఇలాంటి ఘటనే పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. ఒకరి ఇంటి ముందు ఉన్న మొక్కను మరొకరు పీకివేడయంతో వివాదం చేలరేగి అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి, ఆ తర్వాత మంత్రిగారి రంగ ప్రవేశం దాకా వెళ్లింది. మంత్రిగారికి పోటీగా టీడీపీ నేతలు సీన్ లోకి వచ్చారు. మధ్యలో పోలీసులు నవ్వాలో ఏడవాలో తెలియక తలలుపట్టుకుంటున్నారు.

తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో పుల్లా శ్రీనివాస్, తమ్మబత్తుల ధనరాజు ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. ఈనెల 7న ధనరాజు ఎవరూ లేని సమయంలో వెళ్లి శ్రీనివాస్ ఇంటి ముందు ఉన్న మొక్కను పీకేసి వచ్చాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన శ్రీనివాస్ మొక్కను ఎందుకు పీకేశారని తమ్మబత్తుల ధనరాజును నిలదీశాడు. దీంతో గొడవ జరిగింది. మొక్కను పీకేసింది మేమే.. దిక్కున్న చోట చెప్పుకో అని ధనరాజ్ కుటుంబం తేల్చిచెప్పింది. ఆ సమయంలో శ్రీనివాస్‌పై భౌతికంగా దాడి చేశారు. దీంతో అత‌డు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా కేసు న‌మోదు చేశారు.

మొక్క పీకేయ‌డ‌మే ఒక వెధవ ప‌ని. కానీ ధ‌న‌రాజు త‌ర‌పున మంత్రి మాణిక్యాల రావు రంగంలోకి దిగారని మీడియా కథనాలు చెబుతన్నాయి.. ధ‌న‌రాజు కుటుంబంపై కేసులు లేకుండా చూడాల‌ని మంత్రి ఒత్తిడి తెస్తున్నార‌ట‌. అంతే కాదు శ్రీనివాస్‌నే అరెస్ట్ చేయాలంటూ అటు వైపు నుంచి సూచ‌న‌లు కూడా వ‌చ్చాయ‌ని చెబుతున్నారు.

శ్రీనివాస్‌పై ధ‌న‌రాజు కుటుంబం దాడి చేసిన‌ట్టు ఆధారాలున్నాయ‌ని ఎస్ఐ వివ‌రించే ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లితం లేక‌పోయింది. ”నేను చెప్పింది చేస్తావా లేదంటే ఎస్పీతో మాట్లాడమంటావా” అని స్థానిక పోలీసుల‌ను మంత్రి హెచ్చ‌రించార‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇటీవల కాల్‌మనీ కేసులో నిందితుడిగా ఉన్న చేడూరి విశ్వేశ్వరరావుకు ధ‌న‌రాజ్ స్వ‌యంగా బావ‌మ‌రిది అవుతాడు. అలాంటి వ్య‌క్తిని రక్షించేందుకు మంత్రి రంగ ప్ర‌వేశం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

మంత్రి ఒత్తిళ్లు న‌డుస్తుండ‌గానే శ్రీనివాస్‌కు అండ‌గా టీడీపీ నేత‌లు రంగ ప్ర‌వేశం చేశారు. మంత్రి ఒత్తిళ్ల‌కు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. మొక్కే క‌దా అని పీకేసిన ధ‌న‌రాజ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌పై ఒత్తిడి పెంచారు. ‘మంత్రి మాణిక్యాలరావు చెప్పినట్టు వినకండి. మీరేం చేయాలో అదే చేయండి. మీకేం కాకుండా మేం చూసుకుంటాం’ అంటూ టీడీపీ నేతలు పోలీసుల తరఫున మాట్లాడుతున్నట్టు సమాచారం. చిన్న విష‌యాన్ని బీజేపీ, టీడీపీ నేత‌లు మ‌రింత పెద్ద‌ది చేస్తుండ‌డంతో పోలీసుల‌కు దిక్కుతోచ‌డం లేదు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News