దరిద్రులే ఆ పని చేస్తారు- ప్రాణాలైనా తీసుకుంటానే గానీ..
కడప జిల్లా రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. జిల్లాలో కేవలం ఒక ఎమ్మెల్యేని మాత్రమే ప్రజలు గెలిపించినా టీడీపీ నేతలు మాత్రం తగ్గడం లేదు. ఓడినవారే అక్కడ రాజ్యమేలుతున్నారు. జనంతో సంబంధం లేకుండా పెద్దల సభకు వెళ్లిన వారే చక్రం తిప్పుతున్నారు. అన్యాయం అంటూ అరవడం వైసీపీ వంతైంది. కడప జెడ్పీ సమావేశంలోనూ మరోసారి ఓడినవారికి రాచమర్యాదలపై రచ్చ జరిగింది. ఎమ్మెల్యేగా పోటి చేసి ఓడిపోయిన వరదరాజుల రెడ్డిని సభావేదికపై కూర్చొబెట్టడాన్ని వైసీపీ ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సమయంలో […]
కడప జిల్లా రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. జిల్లాలో కేవలం ఒక ఎమ్మెల్యేని మాత్రమే ప్రజలు గెలిపించినా టీడీపీ నేతలు మాత్రం తగ్గడం లేదు. ఓడినవారే అక్కడ రాజ్యమేలుతున్నారు. జనంతో సంబంధం లేకుండా పెద్దల సభకు వెళ్లిన వారే చక్రం తిప్పుతున్నారు. అన్యాయం అంటూ అరవడం వైసీపీ వంతైంది. కడప జెడ్పీ సమావేశంలోనూ మరోసారి ఓడినవారికి రాచమర్యాదలపై రచ్చ జరిగింది. ఎమ్మెల్యేగా పోటి చేసి ఓడిపోయిన వరదరాజుల రెడ్డిని సభావేదికపై కూర్చొబెట్టడాన్ని వైసీపీ ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ సమయంలో వరదరాజుల రెడ్డికి మర్యాదలు చేయడాన్ని రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ సమర్ధించుకున్నారు. వరదరాజుల రెడ్డి టీడీపీ వ్యక్తి కాబట్టి మేం సపోర్టు చేస్తామని బహిరంగంగానే చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. గతంలో రోజా, హరికృష్ణ సమక్షంలో ప్రసాద్ రెడ్డి టీడీపీలో చేరలేదా అని ప్రశ్నించారు. అప్పట్లో చంద్రబాబు దేవుడని పొగిడి…. ఇప్పుడు మాత్రం టీడీపీ పనికి మాలిన పార్టీ అని విమర్శిస్తావా అంటూ సీఎం రమేష్ కాసేపు రగిలిపోయారు.
ఇందుకు వైసీపీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. తాను ఏనాడు చంద్రబాబును మెచ్చుకోలేదని చెప్పారు. టీడీపీలో చేరాల్సి వస్తే ప్రాణాలైనా తీసుకుంటానని ఘాటుగా వ్యాఖ్యానించారు. టీడీపీ అంటేనే అసహ్యమేస్తోందన్నారు. దరిద్రులు తప్ప మరెవరూ టీడీపీలో చేరరన్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని వ్యతిరేకించలేదని, చంద్రబాబును పొగడలేదని తెలిపారు. టీడీపీ నాయకుల కుట్రలు, కుతంత్రాలు తమపై పనిచేయబోవన్నారు ప్రసాద్ రెడ్డి. జిల్లాలో పదేపదే ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఇతర వైసీపీ ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. ప్రొటోకాల్ పాటించకపోతే ఢిల్లీలో ఫిర్యాదు చేస్తామని ఎంపీ మిధున్ రెడ్డి హెచ్చరించారు.
Click on Image to Read: