అరేహో వైసీపీ సాంబ... ఈ డెడ్‌లైన్ల‌ను రాసిపెట్టుకో!

”ఫలాన ప‌నిని త్వ‌ర‌లోనే పూర్తి చేస్తాం. మెరుపువేగంతో పూర్తి చేస్తాం. కొద్దికాలంలోనే టార్గెట్ రీచ్ అవుతాం”. సాధార‌ణంగా తెలివైన రాజకీయనాయ‌కులు చెప్పే మాట‌లు ఇవి. డెడ్‌లైన్ డేట్ ప్ర‌క‌టించ‌కుండా ”త్వ‌ర‌లోనే” అంటూ ముందుకెళ్తూ ఉంటారు. కానీ ఫలాన తేది నాటికి ఆ ప‌ని చేస్తాం రాసిపెట్టుకోండి అంటే మాత్రం ఆలోచించాల్సిందే. ఆ డెడ్‌లైన్ల‌ను జాగ్ర‌త్త‌గా రాసిపెట్టుకోవాల్సిందే. తాజాగా ఏపీ మంత్రులు దేవినేని ఉమ‌, ప్ర‌త్తిపాటి పుల్లారావు రెండు వేర్వేరు అంశాల‌పై డెడ్‌లైన్లు ప్ర‌క‌టించారు. రాసిపెట్టుకోవాల్సింది వైసీపీ వాళ్లే. దేవివేని […]

Advertisement
Update:2016-02-17 04:17 IST

”ఫలాన ప‌నిని త్వ‌ర‌లోనే పూర్తి చేస్తాం. మెరుపువేగంతో పూర్తి చేస్తాం. కొద్దికాలంలోనే టార్గెట్ రీచ్ అవుతాం”. సాధార‌ణంగా తెలివైన రాజకీయనాయ‌కులు చెప్పే మాట‌లు ఇవి. డెడ్‌లైన్ డేట్ ప్ర‌క‌టించ‌కుండా ”త్వ‌ర‌లోనే” అంటూ ముందుకెళ్తూ ఉంటారు. కానీ ఫలాన తేది నాటికి ఆ ప‌ని చేస్తాం రాసిపెట్టుకోండి అంటే మాత్రం ఆలోచించాల్సిందే. ఆ డెడ్‌లైన్ల‌ను జాగ్ర‌త్త‌గా రాసిపెట్టుకోవాల్సిందే. తాజాగా ఏపీ మంత్రులు దేవినేని ఉమ‌, ప్ర‌త్తిపాటి పుల్లారావు రెండు వేర్వేరు అంశాల‌పై డెడ్‌లైన్లు ప్ర‌క‌టించారు. రాసిపెట్టుకోవాల్సింది వైసీపీ వాళ్లే.

దేవివేని ఉమ పోల‌వరం నిర్మాణంపై డెడ్‌లైన్ ప్ర‌క‌టించారు. 2018నాటికి పోల‌వ‌రం పూర్తి చేసి తీరుతామ‌ని ప్ర‌క‌టించారు. ”జ‌గ‌న్ రాసి పెట్టుకో” అని పంచ్ డైలాగ్ విసిరారు. అయితే 2018 నాటికి పోల‌వ‌రం పూర్తి చేస్తామ‌ని మంత్రి చెప్ప‌డం ఇది తొలిసారి కాదు. అధికారం చేప‌ట్టిన తొలి రోజే తొలి డైలాగ్ కింద నీటిపారుద‌ల శాఖ మంత్రి ఇదే మాట సెల‌విచ్చారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు పోల‌వ‌రం వ‌ద్ద కొత్త‌గా ఒక టిప్ప‌ర్ మ‌ట్టి తీసింది కూడా లేదు. కానీ రెండేళ్లు గ‌డిచిపోయింది. అయినా స‌రే మంత్రి ఉమ అదే డెడ్‌లైన్‌ను ఫిక్స్ అవ‌డం ఆశ్చ‌ర్య‌మే. బ‌హుశా ప్రాజెక్ట్ అంచ‌నా వేయాన్ని రూ. 16 వేల కోట్ల నుంచి ఏకంగా రూ. 36 వేల కోట్ల‌కు పెంచారు క‌దా!. ఆ ఊపుతో పోల‌వ‌రం పూర్తి చేస్తారేమో!.

ఇక మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఊసరవెల్లి ఎమ్మెల్యేల విషయంలో డెడ్ లైన్ పెట్టారు. వైసీపీకి చెందిన 10 ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని గుంటూరులో చెప్పారు. బడ్జెట్ సమావేశాల లోపు వీరు పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని రఫ్‌గా ముహూర్తం కూడా ప్రకటించారు. స్థానిక నాయ‌కుల‌తో మాట్లాడి సీఎం కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నార‌ని పుల్లారావు చెప్పారు. పోల‌వ‌రం డెడ్‌లైన్‌కు ఇంకా చాలా కాలం ఉంది. పుల్లారావు చెప్పిన‌ట్టు నిజంగా 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారో లేదో త్వ‌ర‌లోనే తేలిపోతుంది. లేకుంటే పుల్లారావు మాట‌లు కూడా ”ఆ” మీడియా క‌థ‌నాల్లాగే మిగిలిపోతాయేమో చూడాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News