ఫ్యాన్ కిందకు ఆనం... ఆ "ఆనం"తో సరితూగుతారా?

ఏపీలో నేతలంతా టీడీపీ, వైసీపీలో ఏదో ఒక పార్టీ వైపు పోలరైజ్ అవుతున్నారు. ఇటీవల మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి టీడీపీలో చేరగా ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన ఆనం విజయ్‌కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లో జ‌గ‌న్ స‌మక్షంలో విజ‌య్‌కుమార్ రెడ్డి ఆయ‌న కుమారుడు కార్తీకేయ రెడ్డి పార్టీలో చేరారు. జిల్లాలో పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తాన‌ని విజ‌య్‌కుమార్ రెడ్డి చెప్పారు. విజ‌య్‌కుమార్ రెడ్డి … త‌న సోద‌రుడు ఆనం […]

Advertisement
Update:2016-02-17 05:36 IST

ఏపీలో నేతలంతా టీడీపీ, వైసీపీలో ఏదో ఒక పార్టీ వైపు పోలరైజ్ అవుతున్నారు. ఇటీవల మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి టీడీపీలో చేరగా ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన ఆనం విజయ్‌కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లో జ‌గ‌న్ స‌మక్షంలో విజ‌య్‌కుమార్ రెడ్డి ఆయ‌న కుమారుడు కార్తీకేయ రెడ్డి పార్టీలో చేరారు.

జిల్లాలో పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తాన‌ని విజ‌య్‌కుమార్ రెడ్డి చెప్పారు. విజ‌య్‌కుమార్ రెడ్డి … త‌న సోద‌రుడు ఆనం వివేకానంద‌రెడ్డికి నెల్లూరు రూర‌ల్ మండ‌లంలో వెన్నుముక‌లా ఉండేవారు. ఇప్పుడు ఆయ‌న వైసీపీలో చేర‌డం వివేకానంద‌రెడ్డికి చాలా న‌ష్ట‌మే అంటున్నారు. విజ‌య్ కుమార్ రెడ్డి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే అదే ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, వివేకానంద కుమారుడు కూడా ఘోరంగా ఓడిపోయారు. రామ‌నారాయ‌ణ‌రెడ్డికి 10 వేల ఓట్లు రాగా, వివేకా కుమారుడికి అంత‌క‌న్నా త‌క్కువ‌గానే ఓట్లు పోల‌య్యాయి. అయితే ఆ ఆనం బ్ర‌ద‌ర్స్‌కు ఈ ఆనం ఎంత‌వ‌ర‌కు బ్యాలెన్స్ అవుతారో!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News