ఆ బలుపుకు... ఈ వాపుకు తేడా ఉంది!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం బట్టలు విప్పేసినట్టుగానే ఉంది. ప్రతిపక్షం లేకుండా చేయడం ఒక ఘనకార్యమన్న సిద్ధాంతాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు బహుచక్కగా ఆవిష్కరిస్తున్నారు. మొన్నటి వరకు టీటీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకుంటే గగ్గోలు పెట్టిన సైకిల్ పార్టీ ఇప్పుడు ఏపీలో అదే పని చేసేందుకు సిద్ధమైంది. ఏకంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎలా ప్రలోభపెట్టాలన్న దానిపై ముఖ్యమంత్రే స్వయంగా సమీక్ష నిర్వహించడం బహుశా చరిత్రలో జరిగి ఉండకపోవచ్చు. సోమవారం కేబినెట్ భేటీ అనంతరం కళా వెంకట్రావు, కుమారుడు లోకేష్‌తో చంద్రబాబు […]
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం బట్టలు విప్పేసినట్టుగానే ఉంది. ప్రతిపక్షం లేకుండా చేయడం ఒక ఘనకార్యమన్న సిద్ధాంతాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు బహుచక్కగా ఆవిష్కరిస్తున్నారు. మొన్నటి వరకు టీటీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకుంటే గగ్గోలు పెట్టిన సైకిల్ పార్టీ ఇప్పుడు ఏపీలో అదే పని చేసేందుకు సిద్ధమైంది. ఏకంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎలా ప్రలోభపెట్టాలన్న దానిపై ముఖ్యమంత్రే స్వయంగా సమీక్ష నిర్వహించడం బహుశా చరిత్రలో జరిగి ఉండకపోవచ్చు. సోమవారం కేబినెట్ భేటీ అనంతరం కళా వెంకట్రావు, కుమారుడు లోకేష్‌తో చంద్రబాబు వలసలపై సమీక్ష నిర్వహించారు. వలసలకు చంద్రబాబు గేట్లు ఎత్తేందుకు సిద్ధమయ్యారని టీడీపీ అనుకూల పత్రికలు కూడా పతాక శీర్షికతో ఈ అంశాన్ని ప్రచురించాయి. అయితే వలసల విషయంలో చంద్రబాబు, కేసీఆర్ తీరులో స్పష్టమైన తేడా ఉంది.
తెలంగాణలో టీఆర్‌ఎస్ అన్ని ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తోంది. ప్రతిపక్ష నాయకులకు తమ మనుగడపై బెంగ సృష్టించి వారిని కారెక్కించుకుంటోంది. ఒకరకంగా అవన్నీ బలుపు చూసి సాగుతున్న వలసలు. ఏపీలో మాత్రం సీన్ అందుకు పూర్తి భిన్నం. తెలంగాణలో ఉన్నంత బలహీనంగా ఏపీలో ప్రతిపక్షం లేదు. పైగా ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వరుసగా ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. సీమాంధ్రులుండే గ్రేటర్ పరిధిలో సైతం టీడీపీ దారుణంగా ఓడిపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఒక విధంగా ఓటుకు నోటు, ప్రత్యేక హోదా సాధనలో వైఫల్యం, గ్రేటర్ ఎన్నికలు, విజయవాడ కాల్ మనీ కేసు, ఏపీలో రగులుతున్న రిజర్వేషన్ల అంశం ఇలా వరుసగా తగులుతున్న దెబ్బలకు చంద్రబాబు ప్రభుత్వానికి తలబొప్పి కట్టి వాపు వచ్చేసింది. ఆ వాపుకు వైద్యంగానే ప్రతిపక్షాన్ని మానసికంగా దెబ్బతీసేందుకు వలసదారులకు చంద్రబాబు ఆహ్వానం పలుకుతున్నట్టు భావిస్తున్నారు. పాలనావైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే అవసరం లేకున్నా ఇలాంటి ఎత్తులు వేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు.
”చూశారా… ఏపీలో మా పార్టీ బలంగా ఉంది కాబట్టే వైసీపీ నుంచి నేతలు క్యూ కడుతున్నారు” అని చాటుకునేందుకు ఈ ఎత్తుగడ వేసినట్టు అర్థమవుతోంది. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకున్నంత మాత్రాన అధికారం తమకు శాశ్వతమైపోతుందని భావించే అమాయకులు కాదు చంద్రబాబు. ఎందుకంటే పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్పప్పుడు టీడీపీ నుంచి ఇలాగే ఎందరో ఎమ్మెల్యేలు బయటకు వెళ్లారు. కానీ తీరా ఎన్నికల సమయంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు కలిసిరావడంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలను గోడ దూకించినంత మాత్రాన వారికి ఓటేసిన జనం కూడా ఇటుగా వస్తారనుకోవడం అమాయకత్వమే.
Click on Image to Read: