పాయే.. సెక్యూరిటీ సొమ్ము కూడా పాయే!

తెలంగాణ టీడీపీకి మరో ఘోర పరాజయం పలకరించింది. గ్రేటర్‌ ఘోర ఓటమి నుంచి కోలుకోకముందే మెదక్‌ జిల్లా నారాయణఖేడ్ ఎన్నికల్లో టీడీపీ చిత్తు అయింది. కనీసం డిపాజిట్లను కూడా దక్కించుకోలేక చేతులెత్తేసింది. ఏ అభ్యర్థి అయినా డిపాజిట్ దక్కించుకోవాలంటే పోలైన చెల్లుబాటు ఓట్లలో ప్రతి ఆరు ఓట్లకు ఒక ఓటు సాధించాల్సి ఉంటుంది. కానీ టీడీపీ ఆ టార్గెట్‌ను రీచ్ కాలేకపోయింది. నారాయణఖేడ్‌ బైపోల్‌లో మొత్తం లక్షా 54,866 ఓట్లు పోలయ్యాయి. డిపాజిట్ రావాలంటే 25 వేలకు […]

Advertisement
Update:2016-02-16 06:22 IST

తెలంగాణ టీడీపీకి మరో ఘోర పరాజయం పలకరించింది. గ్రేటర్‌ ఘోర ఓటమి నుంచి కోలుకోకముందే మెదక్‌ జిల్లా నారాయణఖేడ్ ఎన్నికల్లో టీడీపీ చిత్తు అయింది. కనీసం డిపాజిట్లను కూడా దక్కించుకోలేక చేతులెత్తేసింది. ఏ అభ్యర్థి అయినా డిపాజిట్ దక్కించుకోవాలంటే పోలైన చెల్లుబాటు ఓట్లలో ప్రతి ఆరు ఓట్లకు ఒక ఓటు సాధించాల్సి ఉంటుంది. కానీ టీడీపీ ఆ టార్గెట్‌ను రీచ్ కాలేకపోయింది.

నారాయణఖేడ్‌ బైపోల్‌లో మొత్తం లక్షా 54,866 ఓట్లు పోలయ్యాయి. డిపాజిట్ రావాలంటే 25 వేలకు పైగా ఓట్లు రావాల్సి ఉంది. కానీ టీడీపీ కేవలం 14 వేల 787 ఓట్లు మాత్రమే సాధించింది. దీంతో డిపాజిట్ గల్లంతైంది. కాంగ్రెస్ 39 వేల 451 ఓట్లు సాధించింది. టీఆర్‌ఎస్‌ 53వేల 625 ఓట్ల మేజారిటీతో విజయం సాధించింది. ఆ పార్టీకి మొత్తం 93 వేల 76 ఓట్లు వచ్చాయి. ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యం కనబరిచింది. టీడీపీ చాలా రౌండ్లలో వెయ్యి ఓట్లను కూడా సాధించలేకపోయింది. కేవలం నాలుగు రౌండ్లలో మాత్రమే వెయ్యికి మించి ఓట్లను టీడీపీ సాధించగలిగింది.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News