పళ్లెం తిరగేసి పెళ్లాన్ని కొట్టాలి: మంత్రిగారి మాణిక్యం

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. రాజమండ్రిలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ భేటీలో భార్యభర్తల సంబంధంపై మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మొగుడు పళ్లెం తిరగేసి కొడితేనే పెళ్లాం వంట చేసి పెడుతుందన్నారు. అలాగే మనం కూడా ప్రాధేయపడే స్థాయి నుంచి భయపెట్టే స్థాయికి ఎదగాలని సమావేశంలో పార్టీ శ్రేణులకు చెప్పారు. ఈ పోలికపై మహిళా నేత ఒకరు తీవ్ర అభ్యంతరం చేశారు. వెంటనే తేరుకున్న మాణిక్యాల రావు… పెళ్లాం గరిటె తిరగేసినా మొగుడు […]

Advertisement
Update:2016-02-15 07:43 IST

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. రాజమండ్రిలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ భేటీలో భార్యభర్తల సంబంధంపై మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మొగుడు పళ్లెం తిరగేసి కొడితేనే పెళ్లాం వంట చేసి పెడుతుందన్నారు. అలాగే మనం కూడా ప్రాధేయపడే స్థాయి నుంచి భయపెట్టే స్థాయికి ఎదగాలని సమావేశంలో పార్టీ శ్రేణులకు చెప్పారు. ఈ పోలికపై మహిళా నేత ఒకరు తీవ్ర అభ్యంతరం చేశారు.

వెంటనే తేరుకున్న మాణిక్యాల రావు… పెళ్లాం గరిటె తిరగేసినా మొగుడు కూడా భయపడుతారని కవర్ చేయబోయారు. అయితే మంత్రి ఎంత కవర్ చేసుకున్నా ఆయన వ్యాఖ్యలపై మహిళ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా ఉంటూ భార్యలను పళ్లెం తిరగేసి కొట్టాలని ఎలా చెబుతారని మండిపడుతున్నారు. వారి ఇంట్లోనూ ఇదే పనిచేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అయితే పార్టీ ఎదుగుదలపై కేవలం పోలికగానే మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారని మరికొందరు అంటున్నారు. ఒక సామెతగా మాత్రమే మాణిక్యాల రావు ఈ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News