నష్టాల్లో ప్రారంభైన దేశీయ స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 383 పాయింట్లు.. నిఫ్టీ 116 పాయింట్లు డౌన్
Advertisement
ఇండియన్ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. వారం ప్రారంభంలోనే బాంబే స్టాక్స్ ఎక్స్ఛేంజీ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ రెండూ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 383 పాయింట్లు కోల్పోయి 75,807 పాయింట్ల వద్ద, నిఫ్టీ 116 పాయింట్లు కోల్పోయి 22,976 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్రిటానియా షేర్లు లాభాల్లో ఉండగా, టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Advertisement