ఇక అన్ని రంగాల్లో ఒకే టైమ్ జోన్
ముసాయిదా విడుదల చేసిన కేంద్రం
దేశంలోని అన్ని రంగాల్లో ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (ఐఎస్‌టీ) వినియోగం ఇకపై తప్పనిసరి కానుంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం లీగ ల్ మెట్రాలజీ (ఇండియన్ స్టాండర్డ్ టైమ్) గైడ్‌లైన్స్ - 2024 ముసాయిదా రూపొందించింది. ఫిబ్రవరి 14లోగా ఈ డ్రాఫ్ట్ నిబంధనలపై దేశ ప్రజల అభిప్రాయాలు సేకరించి వాటికి అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాత ఈ చట్టం అమల్లోకి వస్తుంది. చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే దేశంలోని అన్ని చట్టపరమైన కార్యకలాపాలు, పరిపాలన, వ్యాపార వాణిజ్యరంగాలు, ఫైనాన్స్ సెక్టార్ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ఉత్తర్వులు, ఇతర డాక్యుమెంట్లలోనూ ఐఎస్‌టీని తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇంతకుముందు ఆయా రంగాలు తమ ఫ్లెక్సిబులిటీని బట్టి వేర్వేరు టైమ్ జోన్లను పేర్కొన్నట్టుగా ఇది చట్టరూపం దాల్చిన తర్వాత అవకాశం ఉండదు. ఈ చట్టం పరిధి నుంచి ఎయిర్ స్పేస్, నేవీ, సైంటిఫిక్ రీసెర్చ్ లాంటి కీలకరంగాలకు మినహాయింపునిచ్చారు.