మండలానికి ఒక గ్రామం ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చారా? : కేటీఆర్

నాలుగు సంక్షేమ పథకాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగాఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Update:2025-01-26 16:22 IST

తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన నాలుగు సంక్షేమ పథకాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఫైర్‌య్యారు. మండలానికి ఒక పైలట్ గ్రామంలోనే వంద శాతం అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్‌పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలానికి ఒక గ్రామంలోనే అమలు చేస్తామని మీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో పంచారా? అని, మండలానికి ఒక విలేజ్‌లోని అని మీ గ్యారెంటీ కార్డులు ఇచ్చారా? అని, మండలానికి ఒక గ్రామంలోనే అని మీ ఎన్నికల ప్రచారం చేశారా? అని భట్టిని కేటీఆర్ ప్రశ్నించారు. మండలానికి ఒక గ్రామంలోనే ప్రజలను ఓట్లేయమని అడిగారా? అని, మండలానికి ఒక గ్రామంలోనే ఓట్లు వేస్తేకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారా? అని నిలదీశారు.

ఎన్నికల్లో నాడు "అందరికీ అన్నీ.." అని..నేడు "కొందరికే కొన్ని.." పేరిట మభ్యపెడితే నాలుగు కోట్ల తెలంగాణ మీ నయవంచనను క్షమించదని కేటీఆర్ హెచ్చరించారు. ఎన్నికలప్పుడు తెలంగాణలోని ప్రతి మండలం..ప్రతి గ్రామంలోని..ప్రతి ఇంటా..అబద్ధపు హామీలను ఊదరగొట్టి.."వన్ ఇయర్" తరువాత "వన్ విలేజ్"అనడం ప్రజలకు వెన్నుపోటు పొడవడమేనని కేటీఆర్ విమర్శించారు. ప్రతిపక్షంగా ఇంకో నాలుగేళ్లు..ఓపిక పట్టడానికి మేము సిద్ధం కానీ.. ఏరు దాటక తెప్ప తగలేసే మీ ఏడాది దగా పాలన చూసిన తరువాత ఆగడానికి ప్రజలు మాత్రం సిద్ధంగా లేరన్నారు. గుర్తుపెట్టుకోండి. "పథకాలు రాని గ్రామాల్లో.." రేపటి నుంచి.."ప్రజా రణరంగమే..!!" అంటూ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చారించారు.

Tags:    
Advertisement

Similar News