ఊరుకోండి బాబు గారు.. ఆ మాటలు ఇప్పుడెందుకు గానీ!

రాష్ట్ర విభజన దెబ్బకు చాలా మంది నేతల తలరాతలు మారిపోయాయి. అప్పటి వరకు కింగ్‌లా బతికినోళ్లు విభజన తర్వాత బొంగులైపోయారు. మరి కొందరు మాత్రం పెద్దపెద్ద పీఠాలు ఎక్కేశారు. చంద్రబాబు మాత్రం రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన తొలి బాధితుడిని తానేనని చెబుతున్నారు. ఏపీఎన్జీవోల సభలో కూడా మరోసారి ఇదే మాట అన్నారు. అయితే చంద్రబాబు బాధితుడు అనడం కన్నా తొలి లబ్దిదారుడు అంటే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అందుకు వారు చెబుతున్న కారణాలేంటంటే… రాష్ట్ర విభజన […]

Advertisement
Update:2016-02-14 01:19 IST

రాష్ట్ర విభజన దెబ్బకు చాలా మంది నేతల తలరాతలు మారిపోయాయి. అప్పటి వరకు కింగ్‌లా బతికినోళ్లు విభజన తర్వాత బొంగులైపోయారు. మరి కొందరు మాత్రం పెద్దపెద్ద పీఠాలు ఎక్కేశారు. చంద్రబాబు మాత్రం రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన తొలి బాధితుడిని తానేనని చెబుతున్నారు. ఏపీఎన్జీవోల సభలో కూడా మరోసారి ఇదే మాట అన్నారు. అయితే చంద్రబాబు బాధితుడు అనడం కన్నా తొలి లబ్దిదారుడు అంటే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

అందుకు వారు చెబుతున్న కారణాలేంటంటే… రాష్ట్ర విభజన జరక్కముందు ఉమ్మడి రాష్ట్రంలో 60కిపైగా అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. అయితే గెలుపు సంగతి దేవుడెరుగు… సగానికి పైగా స్థానాల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రాలేదు. కానీ రాష్ణ్ర విభజన నిర్ణయం తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఏపీలో పరిస్థితులు చంద్రబాబుకు పూర్తి అనుకూలంగా మారిపోయాయి. ఎందుకంటే అప్పటి వరకు చంద్రబాబు అంటే ఇష్టపడని వారు కూడా రాష్ట్ర విభజనతో పునరాలోచనలో పడ్డారు. కష్టాల్లో ఉన్న స్టేట్ గట్టెక్కాలంటే చంద్రబాబు లాంటి అనుభవస్తుడే ఉండాలని భావించారు. ఆ ఒక్క పాయింట్‌ కారణంగా చంద్రబాబుకు పరిస్థితి అనుకూలంగా మారిపోయింది. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన స్థాయి నుంచి అధికారం చేపట్టే స్థాయికి పరిస్థితి మారిపోయింది.

ఇదంతా రాష్ణ్ర విభజన వల్లే జరిగిందన్నది జగమెరిగిన‌ సత్యం. అలాంటప్పుడు రాష్ణ్ర విభజనకు తొలి బాధితుడు చంద్రబాబు ఎలా అవుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముమ్మాటికీ రాష్ణ్ర విభజన వల్ల చంద్రబాబే అతిపెద్ద లబ్ధిదారు అని చెబుతున్నారు. ఈ విషయం చంద్రబాబుకూ తెలుసని కానీ జనంలో సానుభూతి పొందేందుకే నేనే తొలి బాధితుడిని, నెంబర్ వన్ పెద్ద కూలీని అని చెబుతుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News