టీడీపీపై అనుకూల మీడియా అధినేత రుసరుస!

టీడీపీని వెనుకేసుకొచ్చే ప్రయత్నంలో ఇటీవల తెలుగుదేశం అనుకూల మీడియా తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. చంద్రబాబుకు చిక్కుల్లో పడినప్పుడు, తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళ్తున్నసమయంలో జనం దృష్టి మళ్లించేందుకు పార్టీ అనుకూల మీడియా చాలా శ్రమిస్తోంది. తెలంగాణలో ఎమ్మెల్యేలు టీడీపీని వీడిన ప్రతిసారి ఏపీలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా ఎమ్మెల్యేలు వస్తున్నారంటూ కథనాలు రాస్తోంది. దీంతో జనం దృష్టి కూడా తెలంగాణ రాజకీయాల మీద నుంచి ఏపీలో జంప్ చేసేది ఎవరన్న దానిపై మళ్లుతోంది. […]

Advertisement
Update:2016-02-13 03:17 IST

టీడీపీని వెనుకేసుకొచ్చే ప్రయత్నంలో ఇటీవల తెలుగుదేశం అనుకూల మీడియా తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. చంద్రబాబుకు చిక్కుల్లో పడినప్పుడు, తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళ్తున్నసమయంలో జనం దృష్టి మళ్లించేందుకు పార్టీ అనుకూల మీడియా చాలా శ్రమిస్తోంది. తెలంగాణలో ఎమ్మెల్యేలు టీడీపీని వీడిన ప్రతిసారి ఏపీలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా ఎమ్మెల్యేలు వస్తున్నారంటూ కథనాలు రాస్తోంది. దీంతో జనం దృష్టి కూడా తెలంగాణ రాజకీయాల మీద నుంచి ఏపీలో జంప్ చేసేది ఎవరన్న దానిపై మళ్లుతోంది.

టీడీపీ అనుకూల మీడియా ఈ ఎత్తుగడను ఇప్పటికే చాలా సార్లు ప్రయోగించింది. మొన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు టీడీపీని వీడినప్పుడు కూడా టీడీపీ అనుకూల పత్రికలు తిరిగి ఇదే ఎత్తు ప్రయోగించాయి. ఆదినారాయణరెడ్డి మొదలుకుని కృష్ణా, గుంటూరు,ప్రకాశం జిల్లాల నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతున్నారని ప్రచురించాయి. అయితే వైసీపీ ఎమ్మెల్యేలంతా ఈ కథనాలను ఖండించడంతో సీన్ రివర్స్ అయింది. దీంతో ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియాసంస్థలు రుసరుసలాడుతున్నాయి.

తనను కలిసిన టీడీపీ నేతల వద్ద ఒక పత్రిక అధినేత తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారని చెబుతున్నారు. ”వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు… అని ఎన్ని సార్లు రాయాలి?. మరోసారి ఇదే కథనాలు రాస్తే అసలు పేపర్‌ను కూడా జనం నమ్మే పరిస్థితి ఉండదు. అనవసరంగా క్రెడిబులిటీ పోగొట్టుకోవాల్సి వస్తోంది” అని రుసరుసలాడారట. ”20 నెలలైంది ఒక్క ఎమ్మెల్యేను కూడా పార్టీలోకి తీసుకురాలేకపోతున్నారు” అని ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ”కనీసం ఒకరిద్దరినైనా జగన్‌ పార్టీ నుంచి బయటకు తీసుకురాలేకపోతే భవిష్యత్తులో తాము కూడా ఇలాంటి కథలు రాయలేము” అని తేల్చిచెప్పారట.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News