కేటీఆర్‌ కు ఆత్మీయ స్వాగతం

హారతి ఇచ్చి.. వీర తిలకం దిద్దిన కవిత, బీఆర్ఎస్‌ నాయకులు

Advertisement
Update:2025-01-09 19:33 IST

ఫార్ములా -ఈ రేస్‌ కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కొని నంది నగర్‌ లోని నివాసానికి చేరుకున్న కేటీఆర్‌ కు కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్‌ నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు. కేటీఆర్‌ సోదరి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హారతి ఇచ్చి, తిలకం దిద్ది ఇంట్లోకి ఆహ్వానించారు. కొడుకును శోభమ్మ గుండెలకు హత్తుకొని భావోద్వేగానికి లోనయ్యారు. కేటీఆర్‌ సతీమణి శైలిమ స్వీట్‌ తినిపించారు. కుటుంబ సభ్యులు, పార్టీ మహిళా నాయకులు, నాయకులు కేటీఆర్‌ ను సాదరంగా స్వాగతించారు.




 


Tags:    
Advertisement

Similar News