తప్పు జరిగింది.. క్షమించండి : పవన్ కళ్యాణ్

తిరుమల తొక్కిసలా ఘటన జరిగేది కాదు. జరిగిన తప్పునకు ప్రజలు క్షమించాలి అని పవన్ కళ్యాణ్ కోరారు.

Advertisement
Update:2025-01-09 18:48 IST

తిరుపతి తొక్కిసలా ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు జరిగింది. క్షమించండి ఇంత మంది అధికారులున్నా ఆరుగురి భక్తులు ప్రాణలు పోవడం సరికాదని టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి మధ్య గొడవలున్నాయని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే మనుషులు చనిపోయారని ఇది అరచే సమయా అంటూ మెగా ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తొక్కిసలాటకు గల కారణాలను అధికారులను అడిగి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. అధికారులు తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

ఈ క్రమంలో అంత మంది భక్తులను ఎందుకని ఒక్కసారిగా క్యూలైన్లలోకి వదలాల్సి వచ్చిందని అధికారులను ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు, పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులు చనిపోతున్నా బాధ్యతగా వ్యవహరించారా? అంటూ నిలదీశారు. సీఎం చంద్రబాబుకు టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవో చెడ్డపేరు తీసుకువస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వారు బాధ్యతగా ఉండి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు. జరిగిన తప్పునకు ప్రజలు క్షమించాలి అని పవన్ కళ్యాణ్ కోరారు.

Tags:    
Advertisement

Similar News