ఈ మౌనం ఇంత ఇరిటేషన్‌ను పుట్టిస్తుందా?

ఎదుటివారి యాక్షన్‌కు ఇటువైపు నుంచి రియాక్షన్ లేకుంటే మండే ఇరిటేషన్ లెవల్సే వేరు. తాము ఇంతగా శ్రమించి చికాకు పెడుతున్నా కాస్తయిన ఇరిటేషన్‌గా ఫీల్ అవకపోవడం ఏమిటని కోపం రావడం సహజం. ఇప్పుడు జగన్‌ విషయంలో టీడీపీ నేతలు, కొన్ని మీడియా సంస్థల పరిస్థితి కూడా ఇలాగే ఉందట. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలోకి క్యూ కడుతున్నారని కష్టించి కథనాలు రాసినా, టీడీపీ నేతలు కేకలు వేస్తున్నా జగన్ మాత్రం సైలెంట్‌గా ఉండడం తెలుగు తమ్ముళ్లకు రివర్స్‌లో […]

Advertisement
Update:2016-02-13 04:01 IST

ఎదుటివారి యాక్షన్‌కు ఇటువైపు నుంచి రియాక్షన్ లేకుంటే మండే ఇరిటేషన్ లెవల్సే వేరు. తాము ఇంతగా శ్రమించి చికాకు పెడుతున్నా కాస్తయిన ఇరిటేషన్‌గా ఫీల్ అవకపోవడం ఏమిటని కోపం రావడం సహజం. ఇప్పుడు జగన్‌ విషయంలో టీడీపీ నేతలు, కొన్ని మీడియా సంస్థల పరిస్థితి కూడా ఇలాగే ఉందట. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలోకి క్యూ కడుతున్నారని కష్టించి కథనాలు రాసినా, టీడీపీ నేతలు కేకలు వేస్తున్నా జగన్ మాత్రం సైలెంట్‌గా ఉండడం తెలుగు తమ్ముళ్లకు రివర్స్‌లో ఇరిటేషన్ తెప్పిస్తోందట.

తెలంగాణ టీడీపీ నుంచి వలసల సమయంలో తమ పార్టీ నాయకత్వం పడుతున్న కంగారులో కనీసం పది శాతం కూడా జగన్‌ పడకపోవడం ఏమిటని అసహనం వ్యక్తం చేస్తున్నారట. అయితే కొందరు సీనియర్ నేతలు మాత్రం జగన్‌ తీరే సరైనదని విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్యేల వలసలపై పత్రిక కథనాలకు స్పందిస్తే టీడీపీ పత్రికలకు మరింత ఉత్సాహం వస్తుంది. జగన్‌ స్పందిస్తే ఆ మరుసటి రోజు రెట్టింపు ఉత్సాహంతో ”వైసీపీలో కలకలం, ఉలిక్కిపడ్డ జగన్, జగన్‌కు చెమటలు పట్టిస్తున్న వలసలు” వంటి హెడ్‌లైన్స్‌ పెట్టి పండుగ చేసుకుంటాయి.

కానీ జగన్‌ స్పందించకపోవడం వల్ల వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని వస్తున్న వార్తలకు పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే టీడీపీ తన అనుకూల పత్రికలతో వైసీపీలో ఇరిటేషన్ రగిల్చేందుకు ప్రయత్నిస్తుంటే… జగన్‌ తన మౌనంతో రివర్స్‌లో టీడీపీలోనే ఇరిటేషన్ పుట్టిస్తున్నారన్న మాట.

Click on Image to Read:


Tags:    
Advertisement

Similar News