ఎర్రబెల్లికి అదే ప్లస్ " సర్దుకు పోవాల్సింది కొండా, కడియమే!
టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీని వీడడంతో వరంగల్ టీడీపీ దాదాపు ఖాళీ అయింది. అదే సమయంలో వరంగల్ టీఆర్‌ఎస్‌లో పవర్ సెంటర్ల సంఖ్య పెరిగిపోయింది. ఒకప్పుడు కత్తులు దూసుకున్న నాయకులు, వారి అనుచరులు మొత్తం ఒకే కారులో ప్రయాణించాల్సిన పరిస్థితి. ఎర్రబెల్లితో కొండా దంపతుల వైరం ఈనాటిదికాదు. వీరి మధ్యపోరాటంలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అనుచరుడు కొల్లి ప్రతాప్‌రెడ్డిని నడిరోడ్డుపై కిరాతకంగా హత్యచేశారు. ఈ కేసులో కొండా […]
టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీని వీడడంతో వరంగల్ టీడీపీ దాదాపు ఖాళీ అయింది. అదే సమయంలో వరంగల్ టీఆర్‌ఎస్‌లో పవర్ సెంటర్ల సంఖ్య పెరిగిపోయింది. ఒకప్పుడు కత్తులు దూసుకున్న నాయకులు, వారి అనుచరులు మొత్తం ఒకే కారులో ప్రయాణించాల్సిన పరిస్థితి. ఎర్రబెల్లితో కొండా దంపతుల వైరం ఈనాటిదికాదు. వీరి మధ్యపోరాటంలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అనుచరుడు కొల్లి ప్రతాప్‌రెడ్డిని నడిరోడ్డుపై కిరాతకంగా హత్యచేశారు. ఈ కేసులో కొండా మురళి జైలుకు కూడా వెళ్లారు. ఓ సమయంలో అటు ఎర్రబెల్లి, ఇటు కొండా మురళీ ప్రాణభయంతో బతికారు.
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొండా దంపతుల భద్రత కోసం అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ఆర్ అసెంబ్లీలోనే ఆందోళనకు దిగి ప్రభుత్వం భద్రత కల్పించేలా చేశారు. 2014 ఎన్నికలకు ముందు కొండా దంపతులు కారెక్కగా సురేఖ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల కొండా మురళీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎర్రబెల్లి, కొండా దంపతుల మధ్యవైరం హత్యల వరకు వెళ్లగా… కడియం శ్రీహరి, ఎర్రబెల్లి మధ్య వైరం మరోటైపు. భౌతిక దాడులు మినహా వీరి మధ్య అన్ని రకాల వివాదాలు నడిచాయి. అంతెందుకు కడియం శ్రీహరి టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అయ్యాక కూడా బహిరంగ వేదికపై ఎర్రబెల్లి గొడవ పెట్టుకున్నారు. ఇద్దరూ పరస్పర బూతులు తిట్టుకున్నారు. అలాంటి వారు ఇప్పుడు ఒకేపార్టీలో పనిచేయాల్సిన పరిస్థితి. అయితే … కొండా, కడియం అనుచరులు మాత్రం ఎర్రబెల్లి రాకపై లోలోన ఆందోళన చెందుతున్నారు.
ఇకపై తన నేతల పలుకుబడి జిల్లాలో తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్, ఎర్రబెల్లి ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. ఈ సమీకరణ ద్వారా ఎర్రబెల్లి జిల్లాలో హవా నడుపుతారని భావిస్తున్నారు. పైగా ఎర్రబెల్లి పైకి టీడీపీలో ఉన్నట్టు కనిపించినా లోలోన టీఆర్‌ఎస్‌తో సంబంధాలను చాలా కాలంగా నడుపుతున్నారని కొండా, కడియం బ్యాచ్ అనుమానం వ్యక్తం చేస్తోంది. అందువల్లే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో బహిరంగ వేదికలపైనే ఎర్రబెల్లి గొడవ పెట్టుకున్నారని గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్, ఎర్రబెల్లి ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం, తాము కూడా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలే కావడంతో ఎర్రబెల్లి రాకపై కొండా దంపతులు, కడియం పెద్దగా వ్యతిరేకించే అవకాశం చిక్కలేదని అనుకుంటున్నారు. చూడాలి. ఈ మూడు కత్తులను కేసీఆర్ తన ఒరలో ఎలా ఇమిడేలా చేస్తారో!.
Click on Image to Read: