నానిని 'మిమ్మల్నే ప్రొడ్యూసర్‌ గారు' అన్న చిరు

ఆయన నన్ను అలా పిలవడంతో ఆశ్చర్యపోయాను అన్న నాని;

Advertisement
Update:2025-03-11 12:00 IST

హీరోగానే కాకుండా నిర్మాతగానూ తన వైవిధ్యాన్ని చాటుకుంటున్నారు నాని. ఆయన ప్రొడ్యూస్‌ చేసిన మూవీ 'కోర్ట్‌: స్టేట్‌ వర్సెస్‌ ఏ నోబడీ' . మార్చి 14న రిలీజ్‌ కానున్నది. తాజాగా ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవితో జరిగిన ఓ సరదా సంభాషణను పంచుకున్నారు.

'నాగచైతన్య పెళ్లిలో నేను కారు దిగి మండపంలోకి వెళ్తుంటే చిరంజీవి ఎదురువచ్చారు. ప్రొడ్యూసర్‌ గారు బాగున్నారా అని పలకరించారు. నన్ను కాదనుకొని వెనక అశ్వినీదత్‌ లాంటి గొప్పవాళ్లు ఎవరైనా వస్తున్నారేమోనని చూశాను. ఎవరూ లేరు. 'మిమ్మల్నే ప్రొడ్యూసర్‌ గారు' అని చిరంజీవి నాకు హగ్‌ ఇచ్చారు. ఆయన నన్ను అలా పిలవడంతో ఆశ్చర్యపోయాను' అని చెప్పారు.

ఇదే ఇంటర్వ్యూలో ప్రియదర్శి మాట్లాడుతూ.. చిరంజీవి 'కోర్ట్‌' పోస్టర్‌ చూసి తనను అభినందించినట్లు చెప్పారు. 'నువ్వు సూట్‌ వేసుకున్న పోస్టర్‌ చూశాను చాలా బాగున్నావు. నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు కదా.. హిట్‌ అవుతుందే అని చిరంజీవి చెప్పారని ప్రియదర్శి తెలిపారు. ఆయన అంత నమ్మకంగా చెప్పడంతో తనకు సంతోషం వేసింది అన్నారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'కోర్ట్‌:స్టేట్‌ వర్సెస్‌ ఏ నోబడీ'. రామ్‌జగదీశ్‌ డైరెక్టర్‌. స్టేట్‌ ఆఫ్‌ తమిళనాడు వర్సెస్‌ రాధాకృష్ణ కేసు ఈ మూవీ కథకు స్ఫూర్తి అని ప్రియదర్శి తాగా వెల్లడించారు. 

Tags:    
Advertisement

Similar News