ఉన్నది పాయే... ఉంచుకున్నది పాయే
ఉన్నది పాయే… ఉంచుకున్నది పాయే. అన్నట్టుగా తయారైంది జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పరిస్థితి. జమ్మలమడుగులో కింగ్‌లా బతికిన ఆది ఇప్పుడు పచ్చపార్టీ ఎప్పుడు పచ్చ జెండా ఊపుతుందా అని జమ్మలమడుగు జంక్షన్‌లో ఎదురుచూస్తున్నారు. చాలాకాలంగా ఆయన టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. అప్పటికీ ఆయనను వైసీపీ నేతలు గౌరవిస్తూ వచ్చారు. ఇంతలో ఆయనే స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి తాను టీడీపీలో చేరేందుకు సిద్దం. మంచి ముహూర్తం పెట్టండని టీడీపీ నాయకత్వానికే పెళ్లి తంతు బాధ్యతలు అప్పగించారు. అప్పటి […]
ఉన్నది పాయే… ఉంచుకున్నది పాయే. అన్నట్టుగా తయారైంది జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పరిస్థితి. జమ్మలమడుగులో కింగ్‌లా బతికిన ఆది ఇప్పుడు పచ్చపార్టీ ఎప్పుడు పచ్చ జెండా ఊపుతుందా అని జమ్మలమడుగు జంక్షన్‌లో ఎదురుచూస్తున్నారు. చాలాకాలంగా ఆయన టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. అప్పటికీ ఆయనను వైసీపీ నేతలు గౌరవిస్తూ వచ్చారు. ఇంతలో ఆయనే స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి తాను టీడీపీలో చేరేందుకు సిద్దం. మంచి ముహూర్తం పెట్టండని టీడీపీ నాయకత్వానికే పెళ్లి తంతు బాధ్యతలు అప్పగించారు.
అప్పటి వరకు టీడీపీ నేతలు కూడా ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు చేయనిప్రయత్నాలు లేవు. ఆది రాకను వ్యతిరేకించవద్దని రామసుబ్బారెడ్డిని కూడా ఇన్‌చార్జ్ మంత్రి గంటా లాంటివారు బతిమలాడుకున్నారు. కానీ ఎప్పుడైతే తాను టీడీపీలో చేరేందుకు సిద్దమని ఆది ప్రకటించారో అప్పటి నుంచి టీడీపీ హృదయస్పందనల్లో తేడా వచ్చిందని ఆది అనుచరులు వాపోతున్నారు. నెలలు గడిచిపోతున్నా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ గడప తొక్కే చాన్స్ రాకపోవడంతో ఆది అనుచరులు ఆందోళనచెందుతున్నారు. వైసీపీ బలహీన పడుతోంది… టీడీపీ బలపడుతోందని ప్రచారం చేసుకునేందుకు తమ నేతను టీడీపీ పెద్దలు ఒకకార్డు ముక్కలా వాడుకుంటున్నారా అని ఆందోళన చెందుతున్నారు.
పైగా టీడీపీ అనుకూల మీడియా సంస్థలు ఆదినారాయణ రెడ్డి పేరును బాగా వాడిపడేస్తున్నాయి. వైసీపీ నుంచి వలసలు అన్న వాక్యం రాయాల్సి వచ్చినప్రతిసారి ”ఇప్పటికే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది కూడా టీడీపీలోచేరేందుకు సిద్ధంగా ఉన్నారు.రేపోమాపో అది పూర్తవుతుంది” అంటూ ఇప్పటికో వెయ్యిసార్లు రాసి ఉంటాయి. కానీ ఇప్పటి వరకు రింగులు కూడా మార్చుకోలేదు. కొద్ది రోజుల క్రితం ఆదినారాయణరెడ్డి సోదరుడు ఒకరు ఫిబ్రవరి 5న తన సోదరుడు టీడీపీలో చేరుతున్నారని, ముహూర్తం ఖాయమైందని ప్రకటించారు. పత్రికల్లో పెద్ద అక్షరాలతో ఐటమ్ వచ్చింది. కానీ ఈ రోజు డేట్ ఎంత?. ఫిబ్రవరి 5 ముహూర్తం దాటి చాలా కాలమైంది.
ఇప్పటికీ ఆదినారాయణరెడ్డి జంక్షన్‌లోనే ఉన్నారు. దీంతో ఇప్పుడు ఆదినారాయణరెడ్డి ఎప్పుడు టీడీపీలో చేరుతున్నారు అని ఆయన అనుచరులను అడిగితే ”ఆ ఒక్కటి అడక్కు” అంటున్నారు. తాను పార్టీ మారుతున్నానని ప్రకటించిన తర్వాత వైసీపీ నేతలు కూడా ఆదితో సంబంధాలు నడపడం లేదు. అటు టీడీపీ నేతలు కూడా గతాన్నిగుర్తుచేసుకుని ఆదితో కలిసేందుకుపెద్దగా ఇష్టపడడం లేదు. దీంతో రాజకీయంగా ఒకరకమైన ఒంటరితనాన్ని ఆయన అనుభవిస్తున్నారని చెబుతున్నారు. అందుకే అంటారు ఉన్న ఊరిలో నష్టమూ…పక్క ఊరిలో లాభమూ రెండూ ఒకటేనని!.
Click on Image to Read: