ప్రభుత్వం పనులు పార్టీ చేస్తోంది !

తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రూల్స్‌, రెగ్యులేషన్స్‌ పక్కనపడేసి పార్టీ ఆలోచనలనే కొన్ని ప్రభుత్వం తరపున పార్టీ కార్యకర్తలు అమలుచేస్తున్నారు. ఎం.ఎల్‌.ఏలుగా తెలుగుదేశం వాళ్లు గెలవనిచోట గెలిచిన ప్రతిపక్ష పార్టీ ఎం.ఎల్‌.ఏలను పట్టించుకోకుండా టీడీపీ నియోజకవర్గ ఇంచార్జిలే ఎం.ఎల్‌.ఏలుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని అధికారిక కార్యక్రమాలలోనూ పాల్గొంటున్నారు. అయినా ప్రతిపక్షనాయకుడు జగన్‌కు చీమకుట్టినట్టుకూడా లేదు. ప్రభుత్వ పథకాలు కూడా తెలుగుదేశం వాళ్లకే పరిమితం అన్నట్లుగా, తెలుగుదేశం వాళ్లే ఆంధ్రప్రదేశ్‌ పౌరులు అన్నట్లుగా నడుస్తోంది ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం పరిస్థితి. ఉదాహరణకు […]

Advertisement
Update:2016-02-10 06:45 IST
ప్రభుత్వం పనులు పార్టీ చేస్తోంది !
  • whatsapp icon

తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రూల్స్‌, రెగ్యులేషన్స్‌ పక్కనపడేసి పార్టీ ఆలోచనలనే కొన్ని ప్రభుత్వం తరపున పార్టీ కార్యకర్తలు అమలుచేస్తున్నారు. ఎం.ఎల్‌.ఏలుగా తెలుగుదేశం వాళ్లు గెలవనిచోట గెలిచిన ప్రతిపక్ష పార్టీ ఎం.ఎల్‌.ఏలను పట్టించుకోకుండా టీడీపీ నియోజకవర్గ ఇంచార్జిలే ఎం.ఎల్‌.ఏలుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని అధికారిక కార్యక్రమాలలోనూ పాల్గొంటున్నారు. అయినా ప్రతిపక్షనాయకుడు జగన్‌కు చీమకుట్టినట్టుకూడా లేదు.

ప్రభుత్వ పథకాలు కూడా తెలుగుదేశం వాళ్లకే పరిమితం అన్నట్లుగా, తెలుగుదేశం వాళ్లే ఆంధ్రప్రదేశ్‌ పౌరులు అన్నట్లుగా నడుస్తోంది ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం పరిస్థితి. ఉదాహరణకు వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడం కూడా అనేకచోట్ల తెలుగుదేశం కార్యకర్తలకే, సానుభూతిపరులకే పరిమితమైంది. ఎన్నో ఏళ్లనుంచి పెన్షను పొందుతున్న వృద్ధులను కూడా టీడీపీ వారి సలహామేరకు ఆ జాబితాల్లోంచి తొలగించారు. మంత్రులు, జన్మభూమి కమిటీ సభ్యులు, అధికార పార్టీ కార్యకర్తలు కలిసి వృద్ధాప్య పెన్షన్ల లిస్టును తయారుచేయడంవల్ల అర్హులైన అనేక మందికి పెన్షన్లు రద్దు అయ్యాయి.

అలా పెన్షన్‌ కోల్పోయిన కర్నూలుజిల్లాకు చెందిన కొందరు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, హైకోర్టులో ఫిటీషన్‌ దాఖలు చేశారు. అధికార పార్టీకి చెందిన వారు వద్దన్న కారణంగానే తమ పెన్షన్లను రద్దుచేశారని వాళ్లు కోర్టుకు నివేదించారు. సాక్ష్యాధారాలు సమర్పించారు. వారి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అర్హులైన వారిలో కొందరికి పెన్షన్లు రద్దుచేయడం అంటే వాళ్లను ఆకలితో చావమనా ప్రభుత్వ ఉద్దేశం అని మండిపడ్డారు. కొందరికి ఇచ్చి కొందరికి పెన్షన్లు ఎందుకు రద్దు చేస్తున్నట్టు? ఈ వివక్ష దేనికి? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News