భూమా సరే... మరి బాబు సంగతేంటి?

అదేంటో గానీ ప్రతిపక్షాలపై చంద్రబాబు ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారో అదే తరహా చిక్కుల్లో ఆయన పదేపదే పడుతున్నారు. వైసీపీలో చురుగ్గా ఉన్న నాయకులపై ఇటీవల పదేపదే ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అధికారపార్టీ ప్రయోగిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒక డీఎస్పీని ”డోన్ట్ టచ్‌ మీ” అన్న ఒక్క మాటను పట్టుకుని వైసీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపారు. తాము అంటరానివారం కాదని దగ్గరకు వచ్చి మాట్లాడండి అని ఒక అధికారిని ఉద్దేశించి ఎమ్మెల్యే […]

Advertisement
Update:2016-02-09 02:46 IST

అదేంటో గానీ ప్రతిపక్షాలపై చంద్రబాబు ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారో అదే తరహా చిక్కుల్లో ఆయన పదేపదే పడుతున్నారు. వైసీపీలో చురుగ్గా ఉన్న నాయకులపై ఇటీవల పదేపదే ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అధికారపార్టీ ప్రయోగిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒక డీఎస్పీని ”డోన్ట్ టచ్‌ మీ” అన్న ఒక్క మాటను పట్టుకుని వైసీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపారు. తాము అంటరానివారం కాదని దగ్గరకు వచ్చి మాట్లాడండి అని ఒక అధికారిని ఉద్దేశించి ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపి ఆమెపైనా అట్రాసిటీ కేసును పెట్టించారు. అంతవరకు బాగానే ఉంది. చట్టం అందరికీ సమానమే అన్న సిద్ధాంతాన్ని అనుసరించి చంద్రబాబు విషయంలోనూ ఇప్పుడు వ్యవస్థ ఒకేలా పనిచేస్తుందా?. ఎస్సీల్లో పుట్టాలని ఎవరూ కోరుకోరు అంటూ మీడియా సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించి ఎస్సీలను చులకన చేశారు. పైగా రాజుల కులంలో పుట్టాలనుకుంటారంటూ పోలిక కూడా పెట్టారు. అట్రాసిటీ చట్టం ప్రకారం ఇలా వ్యాఖ్యానించడం కూడా నేరమే. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఎస్సీ వెళ్లి ఫిర్యాదు చేస్తే చంద్రబాబుపైనా అట్రాసిటీ కేసు నమోదు చేస్తారా?. పైగా మందకృష్ణ మాదిగ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంశాన్ని కూడా చంద్రబాబు ఎత్తి చూపారు. అయినా చంద్రబాబుకు అడ్డుచెప్పేంత సాహసం మన వ్యవస్థలకు ఉందా?.

Click on Image to Read:

 

 

Tags:    
Advertisement

Similar News