ముద్రగడపై ధ్వజమెత్తిన కాపు సీనియర్ నేత
రిజర్వేషన్లపై జీవో అమలు చేసే వరకూ తగ్గేది లేదంటూ ఆమరణ దీక్షకు దిగిన ముద్రగడ పద్మనాభం ఆఖరికి మాత్రం ఉసూరుమనిపించారు. ఒక్క డిమాండ్‌ను కూడా సాధించకుండానే చేతులెత్తేశారు. ప్రభుత్వం ఇది వరకు ఏం చెప్పిందోవాటికే ముద్రగడ అంగీకరించడం చాలా మంది కాపులకు అసంతృప్తినే మిగిల్చింది. ఈ మాత్రం దానికి సభలు, రైలు రోకోలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ముద్రగడపై కాపు సీనియర్ నేత, మాజీ మంత్రి హరిరామజోగయ్య తీవ్రంగా స్పందించారు. ముద్రగడ సాధించింది ఏమీ […]
రిజర్వేషన్లపై జీవో అమలు చేసే వరకూ తగ్గేది లేదంటూ ఆమరణ దీక్షకు దిగిన ముద్రగడ పద్మనాభం ఆఖరికి మాత్రం ఉసూరుమనిపించారు. ఒక్క డిమాండ్‌ను కూడా సాధించకుండానే చేతులెత్తేశారు. ప్రభుత్వం ఇది వరకు ఏం చెప్పిందోవాటికే ముద్రగడ అంగీకరించడం చాలా మంది కాపులకు అసంతృప్తినే మిగిల్చింది. ఈ మాత్రం దానికి సభలు, రైలు రోకోలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ముద్రగడపై కాపు సీనియర్ నేత, మాజీ మంత్రి హరిరామజోగయ్య తీవ్రంగా స్పందించారు. ముద్రగడ సాధించింది ఏమీ లేదని విమర్శించారు. తనపై కేసులు ఎత్తివేయించుకోవడం మినహా ముద్రగడ సాధించింది ఏమీ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాపులకు ముద్రగడ దీక్ష వల్ల ఎలాంటి ప్రయోజనం కలగలేదని మండిపడ్డారు. ముద్రగడ దీక్షపై ప్రెస్‌మీట్ పెట్టి పూర్తి స్థాయిలో మాట్లాడుతానని చెప్పారు.
Click on Image to Read: