ఆ రైతులు రైలుని జప్తు చేశారు!
సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని నిరూపించారు ఆ రైతులు. తమ భూములను తీసుకుని నష్టపరిహారం చెల్లించని ఇండియన్ రైల్వే సంస్థమీద సమైక్యంగా పోరాటం చేసి విజయం సాధించారు. అసలు ఏం జరిగిందంటే…దాదాపు పాతికేళ్ల క్రితం 1991లో కర్ణాటకలో చిత్రదుర్గ, రాయదుర్గ మధ్యనున్న100 కిలోమీటర్ల భూమిని రైల్వే వారు ట్రాక్ నిర్మాణం కోసం తీసుకున్నారు. మార్కెట్ ధరని బట్టి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. అయితే 300 మంది రైతుల్లో 200 మందికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారు. […]
సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని నిరూపించారు ఆ రైతులు. తమ భూములను తీసుకుని నష్టపరిహారం చెల్లించని ఇండియన్ రైల్వే సంస్థమీద సమైక్యంగా పోరాటం చేసి విజయం సాధించారు. అసలు ఏం జరిగిందంటే…దాదాపు పాతికేళ్ల క్రితం 1991లో కర్ణాటకలో చిత్రదుర్గ, రాయదుర్గ మధ్యనున్న100 కిలోమీటర్ల భూమిని రైల్వే వారు ట్రాక్ నిర్మాణం కోసం తీసుకున్నారు. మార్కెట్ ధరని బట్టి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు.
అయితే 300 మంది రైతుల్లో 200 మందికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారు. మిగిలిన 100 మంది తమకు రావాల్సిన సొమ్ముకోసం అప్పటినుండి పోరాటం చేస్తూనే ఉన్నారు. కేసు కోర్టులు మారింది కానీ ప్రయోజనం కనిపించలేదు. 2000 సంవత్సరంలో ఈ కేసు చిత్రదుర్గ కోర్టుకి వచ్చింది. వడ్డీతో కలిపి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించినా రైల్వే అధికారులు పట్టించుకోలేదు. దాంతో అదే కోర్టు, రైతులు వెళ్లి ఆ రైలుని తమ ఆధీనంలోకి తీసుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అలా కోర్టు అనుమతితో వెళ్లిన వందమంది రైతులు ఐదు బోగీలు ఉన్న పాసింజర్ రైలుని అడ్డుకున్నారు. తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ నెల మూడున చిత్రదుర్గ వద్ద హరిహర పూర్, బెంగళూరు పాసింజర్ ట్రైను అలా రైతుల అధీనంలోకి వెళ్లిపోయింది. ప్రయాణీకులను దింపి వెరే రైల్లో పంపాల్సి వచ్చింది.
ఈ చర్యతో నిర్ఘాంత పోయిన రైల్వే అధికారులు ఉరుకులు పరుగుల మీద స్పందించారు. రైల్వే అధికారులతో పాటు డివిజనల్ ఇంజినీర్లు సైతం సంఘటన ప్రదేశానికి వచ్చి అత్యంత త్వరగా నష్టపరిహారం చెల్లించేలా చూస్తామని మాట ఇచ్చారు. మూడోతేదీన ఆపిన రైలుని ఏడున రైల్వే వారికి అప్పగించారు. రైల్వే అధికారులు తాము మాట ఇచ్చినట్టు 45 రోజుల్లో 50మంది రైతులకు ఒక కోటి రూపాయలు చెల్లించాల్సి ఉంది. దీనిపై స్పందించాల్సిందిగా మీడియా, రైల్వే తరపు న్యాయవాదిని అడగ్గా, తాను మీడియాతో మాట్లడకూడదనే నిబంధనలు ఉన్నాయని అన్నారు.