బాబు చర్యపై బీజేపీ సీరియస్‌- అమిత్ షా ఫోన్!

కాపు రిజర్వేషన్ ఉద్యమ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై  బీజేపీ అధిష్టానం ఆరా తీసింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు ఫోన్ చేశారు. రాష్ట్రంలోని పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. ఏపీలో ఏం జరుగుతోంది, కాపుల ఉద్యమ ప్రభావం ఎంత  ఉంది, దీని వల్ల టీడీపీ పరిస్థితి ఎలా ఉంది తదితర అంశాలపై ఆరా తీసినట్టు  వార్తలొస్తున్నాయి. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు అమిత్‌షాకు రాష్ట్రంలోని పరిణామాలను వివరించినట్టు చెబుతున్నారు.  ముఖ్యంగా కాపు గర్జన సభకు వెళ్లిన […]

Advertisement
Update:2016-02-07 09:28 IST

కాపు రిజర్వేషన్ ఉద్యమ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై బీజేపీ అధిష్టానం ఆరా తీసింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు ఫోన్ చేశారు. రాష్ట్రంలోని పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. ఏపీలో ఏం జరుగుతోంది, కాపుల ఉద్యమ ప్రభావం ఎంత ఉంది, దీని వల్ల టీడీపీ పరిస్థితి ఎలా ఉంది తదితర అంశాలపై ఆరా తీసినట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు అమిత్‌షాకు రాష్ట్రంలోని పరిణామాలను వివరించినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా కాపు గర్జన సభకు వెళ్లిన బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణపై కేసు పెట్టడాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుందని చెబుతున్నారు.

మిత్రపక్షమై ఉండి ఒక్క మాట కూడా చెప్పకుండా కన్నాపై కేసులు నమోదు చేయాడాన్ని అమిత్‌షా కూడా తప్పుపట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో బీజేపీ పెద్దలకు టీడీపీ నేతలు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని సమాచారం. తాజాగా రాష్ట్ర నేతలకు ఫోన్ చేసిన అమిత్‌షా ముఖ్యంగా కాపుల బలంపైనా ఆరా తీశారు. కాపులు ఎంత మంది ఉన్నారు, వారిలో టీడీపీపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందన్న విషయాలను అడిగితెలుసుకున్నారు. కాపులు జనాభా అధికంగా ఉన్న నేపథ్యంలో వారికి అనుకూలంగానే ముందుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. కన్నాపై కేసు నమోదును బేస్ చేసుకుని ప్రభుత్వాన్ని తప్పుపట్టే యోచనలో కమలనాథులు ఉన్నారు.

అమిత్‌షా ఫోన్‌ చేసిన సమయంలో కొందరు నేతలు … కేసుల నమోదులో టీడీపీ ప్రభుత్వం చూపుతున్న వివక్షను కూడా వివరించినట్టు తెలుస్తోంది. తహసీల్దార్‌పై చింతమనేని దాడి, కాల్‌మనీ వంటి తీవ్రమైన నేరాల్లోనూ టీడీపీ నేతలపై కేసులు పెట్టకపోవడాన్ని గుర్తు చేశారు. కాపుల రిజర్వేషన్ల అంశంలో మాత్రం బీజేపీ నేతలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాపులపై బైండోవర్ కేసులు నమోదును కూడా అమిత్‌షాకు వివరించారు. ఈ వివరాలు తెలుసుకున్న అమిత్ షా సమగ్ర నివేదికతో ఢిల్లీకి రావాల్సిందిగా రాష్ట్ర బీజేపీ నేతలను ఆదేశించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బహుశా ఇదే అదనుగా ఏపీలో బలపడేందుకు బీజేపీ కూడా ప్రయత్నిస్తోందా అన్న భావన కలుగుతోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News