ఫలితాలపై భలే సమాధానం చెప్పిన రేవంత్

గ్రేటర్‌ ఎన్నికల్లో టీడీపీ అడ్రస్‌ లేకుండా పోవడంతో టీడీపీ నేతలు కంగుతిన్నారు. సెటిలర్లు ఉన్నారు కాబట్టి గట్టి పోటీ ఇస్తామనుకున్న టీడీపీ అడ్రస్‌ లేకుండా పోయింది. ఫలితాలపై రేవంత్ రెడ్డి స్పందిచారు. మేయర్ స్థానం టీఆర్‌ఎస్‌కు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే జనం ఓటేసినట్టుగా ఉందన్నారు. ఓట్ల శాతం పెరిగి ఉంటేనో, తగ్గి ఉంటేనో టీడీపీ గెలిచేదన్న భావన తమకు లేదన్నారు. స్థానిక సంస్థల్లో ఫలితాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం సహజమేనన్నారు.  ఒక ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన పూర్తిగా పట్టం కట్టినట్టు […]

Advertisement
Update:2016-02-05 13:02 IST

గ్రేటర్‌ ఎన్నికల్లో టీడీపీ అడ్రస్‌ లేకుండా పోవడంతో టీడీపీ నేతలు కంగుతిన్నారు. సెటిలర్లు ఉన్నారు కాబట్టి గట్టి పోటీ ఇస్తామనుకున్న టీడీపీ అడ్రస్‌ లేకుండా పోయింది. ఫలితాలపై రేవంత్ రెడ్డి స్పందిచారు. మేయర్ స్థానం టీఆర్‌ఎస్‌కు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే జనం ఓటేసినట్టుగా ఉందన్నారు. ఓట్ల శాతం పెరిగి ఉంటేనో, తగ్గి ఉంటేనో టీడీపీ గెలిచేదన్న భావన తమకు లేదన్నారు. స్థానిక సంస్థల్లో ఫలితాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం సహజమేనన్నారు. ఒక ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన పూర్తిగా పట్టం కట్టినట్టు కాదన్నారు. ప్రజలు స్థానిక సమస్యలు, అభ్యర్థులను చూసి ఓట్లేశారని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు రాజీవ్ గాంధీ 404 ఎంపీ స్థానాల్లో గెలిస్తే నేడు ఆయన కొడుకు రాహుల్ గాంధీ 40 స్థానాలతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్నారని గుర్తు చేశారు. కాబట్టి భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌కు ఇవే ఫలితాలొస్తాయనుకోవడం సరికాదన్నారు. సాధారణ ఎన్నికల్లో అసలు విషయం తెలుస్తుందన్నారు.

కేటీఆర్‌తో సవాల్ పై విలేకర్లు ప్రశ్నించగా రేవంత్ స్పందించారు. తాను సవాల్ విసరలేదని అన్నారు. కేటీఆరే వంద స్థానాలు గెలుస్తామంటే దానికి మాత్రమే ప్రతిస్పందించానని చెప్పారు. కేటీఆరే సవాల్‌పై వెనక్కు తగ్గారని చెప్పారు. తొలుత వంద స్థానాలు గెలుస్తామన్న కేటీఆర్ అనంతరం జెండా ఎగరేస్తామని మాత్రమే అన్నారని రేవంత్ చెప్పుకొచ్చారు.

Click on image to Read

Tags:    
Advertisement

Similar News