ఆవు చేల్లో మేస్తే మురళీమోహన్‌ గట్టున మేస్తారా?

మురళీమోహన్ ఫేమస్ యాక్టర్, తొలిసారి ఎంపీగా కూడా గెలిచారు. ఈయన సినిమాల్లో ఇంత పెద్ద స్టార్ అయ్యారంటే తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమ  ఇలా అన్ని ప్రాంతాల ప్రజల అమాయకత్వపు ఆదరణే కారణం. ఈయన సినిమాల్లో తీసుకునే రెమ్యునరేషన్ సొమ్ములో రాయలసీమ ప్రజలు వేసిన చిల్లర కూడా ఉంటుంది. ఆ చిల్లర చేదు అనిపించలేదు కానీ… ఆ ప్రాంతంపై మాత్రం మురళీమోహన్‌ గారికి తెగ అసూయ ఉన్నట్టు అనిపిస్తోంది. తుని ఘటనపై మొన్నీ మధ్యనే చంద్రబాబు రాయలసీమ ప్రాంతాన్ని, […]

Advertisement
Update:2016-02-05 17:46 IST

మురళీమోహన్ ఫేమస్ యాక్టర్, తొలిసారి ఎంపీగా కూడా గెలిచారు. ఈయన సినిమాల్లో ఇంత పెద్ద స్టార్ అయ్యారంటే తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమ ఇలా అన్ని ప్రాంతాల ప్రజల అమాయకత్వపు ఆదరణే కారణం. ఈయన సినిమాల్లో తీసుకునే రెమ్యునరేషన్ సొమ్ములో రాయలసీమ ప్రజలు వేసిన చిల్లర కూడా ఉంటుంది. ఆ చిల్లర చేదు అనిపించలేదు కానీ… ఆ ప్రాంతంపై మాత్రం మురళీమోహన్‌ గారికి తెగ అసూయ ఉన్నట్టు అనిపిస్తోంది.

తుని ఘటనపై మొన్నీ మధ్యనే చంద్రబాబు రాయలసీమ ప్రాంతాన్ని, పులివెందులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దానిపై సోషల్ మీడియాలో సీమ జనం తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టారు. అయితే టీడీపీ నేతలు మాత్రం మారలేదు. ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు… రాయలసీమకు చెందిన చంద్రబాబే సొంత ప్రాంతాన్ని కించపరుస్తుంటే తానెందుకు ఒక మాట అనుకూడదు అన్నుకున్నారో ఏమో గానీ…. మురళీ మోహన్‌ కూడా సీమపై పేలారు. కొందరు నేతలు రాయలసీమ సంస్కృతిని గోదావరి జిల్లాకు తీసుకొస్తున్నారని వ్యాఖ్యానించారు.

నిజంగా కొందరు ఆ పనే చేసి ఉంటే అధికారం టీడీపీలో చేతిలోనే ఉంది… చెబితే ఏం చేయడానికైనా సిద్ధంగా పోలీసులున్నారు. అలాంటప్పుడు తునిలో విధ్యంసం సృష్టించిన వారిని పట్టుకెళ్లి బొక్కలో వేస్తే ఎవరూ అడ్డుచెప్పరు. కానీ అది చేయలేక పదేపదే సీమ సంస్కృతి అని కించపరచడమే విజ్ఞులైన మురళీమోహన్‌గారికి తగినది కాదేమోనని సీమ ప్రజలు సోషల్ మీడియాలో సూచిస్తున్నారు. అక్కడికేదో మురళీ మోహన్ గారు ఐదు దశాబ్దాల పాటు సీమలో నివసించినట్టు… అక్కడ సంస్కృతిపై రీసెర్చ్ చేసినట్టు మాట్లాడడం ఎంతవరకు సరైనదో వయసులోనూ పెద్దవారైన మురళీ మో హన్‌ సరిచూసుకోవాలంటున్నారు.

నిజంగా తునిలో రాయలసీమ నుంచి వెళ్లిన వారే విధ్వంసం సృష్టించి ఉంటే కనీసం ఒక్క రాయలసీమ వ్యక్తి మీదనైనా కేసు నమోదు చేయాలి కదా. కానీ కేసుల్లో ఉన్న ప్రధాన కాపులంతా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే కదా అని రాయలసీమవాసులు ప్రశ్నిస్తున్నారు. అమాయక తెలంగాణ ప్రజలకు చిల్లర విదిల్చి హైటెక్ సిటీ దగ్గరలో భారీగా భూములు కొట్టేసే సంస్కృతి తమది కాదని రాయలసీమ నెటిజన్లు నిలదీస్తున్నారు. రాయలసీమ సంస్కృతి మీకు నచ్చకపోయినా పరవాలేదు కానీ మీ కృష్ణా, గుంటూరు జిల్లాల సంస్కృతి మాకొద్దు. డబ్బుకోసం ఎంతటి నీచానికైనా దిగజారే మీ సంస్కృతి మాకొద్దు అని నెటిజెన్లు మురళిమోహన్ ను కడిగిపారేస్తున్నారు.

సరే రాయలసీమ సంస్కృతి నచ్చకుంటే ఆయన సినిమాలు కూడా ఈ ప్రాంతంలో ప్రదర్శించడం పవిత్రులు, సౌమ్యులు, ఎలాంటి అక్రమాలు చేయని మురళీమోహన్‌గారికి కూడా సరికాదేమో అని సీమ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయినా రాయలసీమ వాళ్లు బుద్ది ఉండాలే గానీ… సొంత ప్రాంతానికి చెందిన చంద్రబాబే రాయలసీమను పదేపదే కించపరుస్తుంటే ఇక సినిమా రంగంనుంచి వచ్చిన మురళీ మోహన్‌ ఒక మాట అంటే తప్పేముందండి?. అంతా జనం ఖర్మ కాకుంటేనూ?!

Click on image to Read

Tags:    
Advertisement

Similar News