రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా?

 గ్రేటర్‌ హైదరాబాద్ మేయర్ పదవిని వదులుకునేందుకు టీఆర్‌ఎస్ ఏమాత్రం సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఏ మాత్రం చాన్స్‌ తీసుకోవడం లేదు. పక్కాగా వ్యూహరచన చేస్తోంది.  ఇందులో భాగంగా ఎక్స్ఆఫిసియో సభ్యులుగా వ్యవహారాన్ని   తనకు అనుకూలంగా చక్కదిద్దుకుంటోంది.  ఎక్స్‌ అఫిసియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్సీలు  కూడా మేయర్ ఎన్నికలో ఓటేసే అవకాశం ఉంటుంది. అయితే జీహెచ్‌ఎంసీ చట్టం- 1955 ప్రకారం ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు సమయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని చిరునామాయే ఇచ్చి ఉండాలి. కానీ… టీఆర్‌ఎస్‌ […]

Advertisement
Update:2016-02-05 04:35 IST

గ్రేటర్‌ హైదరాబాద్ మేయర్ పదవిని వదులుకునేందుకు టీఆర్‌ఎస్ ఏమాత్రం సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఏ మాత్రం చాన్స్‌ తీసుకోవడం లేదు. పక్కాగా వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఎక్స్ఆఫిసియో సభ్యులుగా వ్యవహారాన్ని తనకు అనుకూలంగా చక్కదిద్దుకుంటోంది. ఎక్స్‌ అఫిసియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్సీలు కూడా మేయర్ ఎన్నికలో ఓటేసే అవకాశం ఉంటుంది. అయితే జీహెచ్‌ఎంసీ చట్టం- 1955 ప్రకారం ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు సమయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని చిరునామాయే ఇచ్చి ఉండాలి. కానీ…

టీఆర్‌ఎస్‌ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తమ పార్టీ ఎమ్మెల్సీలతో జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఓటేసేలా కొత్తగా జీవో తెచ్చింది. నామినేషన్‌ దాఖలు సమయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో అడ్రస్‌ ఇచ్చిన వారూ మాత్రమే మేయర్ ఎన్నికల్లో ఓటేసేలా ఉన్న నిబంధనను తొలగించింది. అడ్రస్ ను కొత్తగా గ్రేటర్ పరిధిలోకి మార్చుకుని ఓటేసే అవకాశం ఇస్తూ జీవో 207 తెచ్చింది. అయితే ఈ జీవోను కాంగ్రెస్ నేత శ్రవణ్ కోర్టులో సవాల్ చేయడం, కోర్టు కూడా ప్రభుత్వ తీరుపై సానుకూలంగా లేని వాతావరణం కనిపించడంతో జీవో మనుగడపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఆర్డినెన్స్ తెచ్చింది.

ఆర్డినెన్స్‌ జారీకి ముందు ముసాయిదాను కేబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది. దీంతో ఫైల్‌ను అందుబాటులో ఉన్న మంత్రుల వద్దకే పంపించి ఆమోదం తీసుకున్నారు. ఆ ఫైల్‌ను అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, ఇతర అధికారులు నేరుగా గవర్నర్‌ దగ్గరకు తీసుకెళ్లి సంతకాలు చేయించుకున్నారు. ఇలా ఆఘమేఘాల మీద ఆర్డినెన్స్ జారీ అయిపోయింది. ఇప్పుడు చిరునామాల మార్పుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 207 ను హైకోర్టు రద్దు చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆర్డినెన్స్ ఆధారంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్సీలు తన చిరునామాను జీహెచ్‌ఎంసీ పరిదిలోకి మార్చుకుని మేయర్ ఎన్నికల్లో ఓటేయవచ్చు. సో అత్యధిక ఎమ్మెల్సీలు ఉన్న టీఆర్ఎస్‌కు మేయర్ ఎన్నికల్లో అదనపు బలం కలిసొచ్చినట్టే.

Click on image to Read

Tags:    
Advertisement

Similar News