టీడీపీని వణికిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే

కాపు రిజర్వేషన్ల అంశం ఎన్ని మలుపులు తిరిగినా చివరకు టీడీపీ వద్దే ఆగుతోంది.  అటు కాపుల నుంచి, ఇటు బీసీల నుంచి చూసినా తొలి ముద్దాయిగా టీడీపీయే నిలబడుతోంది.  ఇప్పుడు కాపులు రిజర్వేషన్ల కోసం ఉద్యమించడంతో అటు బీసీలు కూడా కౌంటర్‌ ఫైట్‌కు రెడీ అవుతున్నారు.  ఇందుకు టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్యే నేతృత్వం వహిస్తుండడంతో ఆంధ్రా టీడీపీ నేతలకు దిక్కుతోచడం లేదు. పైగా ఆర్‌ కృష్ణయ్య ప్రకటనలు మరింత వేడిని రాజేస్తున్నాయి. టీడీపీపై ఆపార్టీలోని కాపు […]

Advertisement
Update:2016-02-04 05:30 IST

కాపు రిజర్వేషన్ల అంశం ఎన్ని మలుపులు తిరిగినా చివరకు టీడీపీ వద్దే ఆగుతోంది. అటు కాపుల నుంచి, ఇటు బీసీల నుంచి చూసినా తొలి ముద్దాయిగా టీడీపీయే నిలబడుతోంది. ఇప్పుడు కాపులు రిజర్వేషన్ల కోసం ఉద్యమించడంతో అటు బీసీలు కూడా కౌంటర్‌ ఫైట్‌కు రెడీ అవుతున్నారు. ఇందుకు టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్యే నేతృత్వం వహిస్తుండడంతో ఆంధ్రా టీడీపీ నేతలకు దిక్కుతోచడం లేదు. పైగా ఆర్‌ కృష్ణయ్య ప్రకటనలు మరింత వేడిని రాజేస్తున్నాయి. టీడీపీపై ఆపార్టీలోని కాపు నేతలకే అనుమానం కలిగేలా ఆ స్టేట్‌మెంట్లు ఉంటున్నాయి.

కృష్ణయ్య తీరుతో కాపులు కావాలో, బీసీలు కావాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఏర్పడేలా ఉందని నేతలు ఆందోళన చెందుతున్నారు. బీసీ సంఘం నేత అయినప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణయ్య కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిస్తే చంద్రబాబు ఎందుకు నిరోధించలేకపోతున్నారని కాపు నేతలు ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్ల విషయంలో తొందరపాటు వద్దంటూ కాపు నేతలకు సూచిస్తున్న చంద్రబాబు అదే ధోరణిలో సొంత పార్టీ ఎమ్మెల్యే అయిన కృష్ణయ్యను ఎందుకు శాంతపరచడం లేదని ప్రశ్నిస్తున్నారు. పైగా ఆర్‌ కృష్ణయ్యకు ఉద్యమాలు కొత్తేమీ కాదంటూ కేబినెట్ భేటీలో చంద్రబాబు స్వయంగా చెప్పడంతో కాపు మంత్రులు సైతం ఆశ్చర్యపోయారు.

కాపులకు కౌంటర్‌గా కృష్ణయ్య ఉద్యమించడం చంద్రబాబుకు ఇష్టంగానే ఉన్నట్టుగా ఉందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాపు గర్జన సమయంలో కాపు నేతలపై కేసులు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు బీసీలు ఆందోళనకు దిగితే వారిపైనా కేసులు పెడుతుందా అని కొందరి ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే సమస్యను పరిష్కరించడం చేతగాక ఇరుపక్షాలను కేసులతో భయపెడుతుందన్న భావన కలిగే అవకాశం ఉంది. పార్టీలో ఉన్న తర్వాత ఎంతటివారైనా పార్టీ లైన్‌కు లోబడే పనిచేయాలని చెప్పే చంద్రబాబు మరి కృష్ణయ్య విషయంలో ఎందుకు స్పందించడం లేదని కాపులు ప్రశ్నిస్తున్నారు.

అడక్కపోయినా రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది చంద్రబాబే… ఇప్పుడు బీసీలను కాపులపైకి రెచ్చగొడుతోంది కూడా చంద్రబాబే అన్న సంకేతాలు జనంలోకి వెళ్తున్నాయని టీడీపీనేతలు ఆందోళన చెందుతున్నారు. రెండు వర్గాలను రెచ్చగొట్టి ముఖ్యమంత్రే స్వయంగా సొంత రాష్ట్రంలో నిప్పు రాజేస్తున్నట్టుగా ఉందంటున్నారు. ఆర్ కృష్ణయ్య తీరుతో కాపు ఓటు బ్యాంకు బలంగా ఉన్న ప్రాంత టీడీపీ ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. పైగా బీసీ జాతీయ సంక్షేమ సంఘం కోఆర్డినేటర్ శ్రీనివాస్‌ గౌడ్ గుజరాత్‌లో రిజర్వేషన్ల అంశం లేవనెత్తిన హార్థిక్ పటేల్ ఊచలు లెక్కపెడుతున్నారని… ఏపీలో ముద్రగడకు అదే గతి పడుతుందని విమర్శించడం చర్చనీయాంశమైంది. కాపుల ఉద్యమం వెనుక జగన్‌ ఉన్నారని ఆరోపించిన చంద్రబాబు… ఇప్పుడు బీసీల ఉద్యమం కూడా తీవ్ర రూపం దాలిస్తే ఎవరిని నిందిస్తారో చూడాలంటున్నారు.

Click on image to Read

Tags:    
Advertisement

Similar News