ఆ రేంజ్‌లో ఊహించుకుని భంగపడ్డారు

సొంతింటికి అద్దె ఇంటికి తేడా ఏంటో జేసీ బ్రదర్స్‌కు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నట్టు ఉంది.  సొంతిల్లు కాంగ్రెస్‌ పాడుపడిపోవడంతో టీడీపీలో చేరిన జేసీ బ్రదర్స్ ఇప్పుడు అవమానాలతో కలిసి కాపురం చేస్తున్నారు. కాంగ్రెస్‌లో కింగ్‌లా బతికిన బ్రదర్స్ టీడీపీలో మాత్రం కనీసం సామంతరాజుల్లా కూడా వెలగలేకపోతున్నారు.  తాజాగా జేసీ బ్రదర్స్‌ రాశి ఫలాల్లో మరో పాయింట్ అవమానం చేరింది. జేసీ బ్రదర్స్‌కు ప్రధాన అనుచరులుగా ఉన్న సత్యనారాయణరెడ్డి, రవీంద్ర రెడ్డికి గన్‌మెన్‌లను కేటాయించాలని జిల్లా పోలీసులను జేసీ ప్రభాకర్ […]

Advertisement
Update:2016-02-04 05:16 IST

సొంతింటికి అద్దె ఇంటికి తేడా ఏంటో జేసీ బ్రదర్స్‌కు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నట్టు ఉంది. సొంతిల్లు కాంగ్రెస్‌ పాడుపడిపోవడంతో టీడీపీలో చేరిన జేసీ బ్రదర్స్ ఇప్పుడు అవమానాలతో కలిసి కాపురం చేస్తున్నారు. కాంగ్రెస్‌లో కింగ్‌లా బతికిన బ్రదర్స్ టీడీపీలో మాత్రం కనీసం సామంతరాజుల్లా కూడా వెలగలేకపోతున్నారు. తాజాగా జేసీ బ్రదర్స్‌ రాశి ఫలాల్లో మరో పాయింట్ అవమానం చేరింది.

జేసీ బ్రదర్స్‌కు ప్రధాన అనుచరులుగా ఉన్న సత్యనారాయణరెడ్డి, రవీంద్ర రెడ్డికి గన్‌మెన్‌లను కేటాయించాలని జిల్లా పోలీసులను జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. సరే అన్న పోలీసులు చివరకు పెయిడ్‌ గన్‌ మెన్లను కేటాయించారు. పెయిడ్‌ గన్‌మెన్లను కేటాయించడంపై నొచ్చుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి తన గన్‌మెన్లను కూడా వెనక్కు పంపించారు. ఇలా చేస్తే దెబ్బకు పోలీసులు దిగివస్తారని ప్రభాకర్ రెడ్డి అనుకున్నారు. పైగా కొన్ని నెలల క్రితం ..

రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో వైసీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డిని టీడీపీ వర్గీయులు దారుణంగా నరికి చంపారు. ఈ హత్యకు సహకరించారన్న ఆరోపణపై ఇద్దరు పోలీస్ అధికారులపై బదిలీ వేటు వేశారు. అయితే ఈ బదిలీలపై మంత్రి పరిటాల సునీత తీవ్రంగా స్పందించారు. తన గన్‌మెన్లను వెనక్కు పంపారు. అంతే డీజీపీ నుంచి జిల్లా ఎస్పీ వరకు అందరూ ఆఘమేఘాల మీద స్పందించి బదిలీలను నిలిపివేశారు. ఇప్పుడు తాను కూడా గన్‌మెన్లను వెనక్కు పంపితే పోలీస్ అధికారులు కూడా దిగివస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఊహించుకున్నారట.

కానీ వారం రోజులు గడుస్తున్నా పట్టించుకున్న పోలీస్ అధికారే లేరు. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జేసీ బ్రదర్స్‌కు టీడీపీలో అవమానాలు కొత్తేమీ కాదు. గతంలో ఒక పనిమీద లోకేష్‌ను కలిసేందుకు ఎంపీ, సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నించగా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని లోకేష్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో దివాకర్ రెడ్డి చాలా బాధాపడ్డారని చెబుతుంటారు. అయినా మరో దారి లేక జేసీ బ్రదర్స్ తమ టైమింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.

Click on image to Read

Tags:    
Advertisement

Similar News