చింతమనేని మరో గ"లీజు"

మహిళా తహసీల్దార్‌ను ఈడ్చికొట్టిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరు మారడం లేదు. ఆయనే కాదు ఆయన అనుచరులు కూడా అలాగే తయారయ్యారు. తాజాగా పెదపాడు మండలం వీరమ్మకుంటలో చింతమనేని బ్యాచ్‌ రచ్చరచ్చ చేసింది. బహిరంగవేలం పాటను అడ్డుకుని తమకు కావాల్సిన రేటుకు చేపల చెరువును సొంతం చేసుకున్నారు. కుర్రపర్రులో రాజగోపాలస్వామి దేవాలయానికి చెందిన 16 ఎకరాల భూమి ఉంది. చుట్టుపక్కల భూములన్నీ చేపల చెరువుగా మారిపోయాయి. దేవాలయం భూమి మాత్రమే ఖాళీగా ఉంది. ఈనేపథ్యంలో దేవాదాయ […]

Advertisement
Update:2016-02-04 11:06 IST

మహిళా తహసీల్దార్‌ను ఈడ్చికొట్టిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరు మారడం లేదు. ఆయనే కాదు ఆయన అనుచరులు కూడా అలాగే తయారయ్యారు. తాజాగా పెదపాడు మండలం వీరమ్మకుంటలో చింతమనేని బ్యాచ్‌ రచ్చరచ్చ చేసింది. బహిరంగవేలం పాటను అడ్డుకుని తమకు కావాల్సిన రేటుకు చేపల చెరువును సొంతం చేసుకున్నారు.

కుర్రపర్రులో రాజగోపాలస్వామి దేవాలయానికి చెందిన 16 ఎకరాల భూమి ఉంది. చుట్టుపక్కల భూములన్నీ చేపల చెరువుగా మారిపోయాయి. దేవాలయం భూమి మాత్రమే ఖాళీగా ఉంది. ఈనేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు ఆ భూమిలో చేపల సాగుకు అనుమతులు తెచ్చారు. ఆ భూమిలో చేపల సాగు లీజుకు వేలం పాట నిర్వహించారు. చాలా మంది వేలం పాటలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాట రూ. 3 లక్షలుగా నిర్ణయించారు. అయితే బహిరంగ వేలంలో కొందరు రూ. ఏడు లక్షల 10 వేలు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే చింతమనేని గ్యాంగ్ దిగింది.

”ఎమ్మెల్యేగారి ఆజ్ఞ … వేలం పాట నుంచి వెళ్లిపోండి. చేపల చెరువు లీజు మాకే కావాలి” అంటూ తేల్చిచెప్పారు. కొందరు ఎదురు ప్రశ్నించగా కొట్టేంత పనిచేశారు. ఈ తంతు సాగుతుండగానే, అందరూ చూస్తుండగానే, బహిరంగ వేలంలోనే లీజు ఎమ్మెల్యే అనుచరుల సొంతమైపోయింది. అది కూడా కేవలం 3 లక్షల 20 వేలకే. బహిరంగవేలంలో ఏడు లక్షలు దాటినా చివరకు ఆలయ ఈవో సాంబశివరావు కేవలం రూ. 3. 20 లక్షలకే భూముల లీజు కట్టబెట్టేశారు. ఇలాంటి దౌర్జన్యాలను ఇంత వరకు సినిమాల్లోనే చూశామని… తొలి సారి ప్రత్యక్షంగా చూశామని వేలంలో పాల్గొన్న వారు అంటున్నారు. అయితే అధికార పార్టీ నేతకు ఎదిరించలేక మౌనంగానే వెళ్లిపోయారు.

Click on image to Read

Tags:    
Advertisement

Similar News