బాబు, కృష్ణయ్యలకు లాజిక్కులు గుచ్చిన బొత్స
కాపుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వైసీపీ నేత బొత్ససత్యనారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు నీచరాజకీయాల కోసం కుల రాజకీయాలను రెచ్చగొడుతున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కాపులు శాంతపరులు, అమాయకులని ఒక వైపు అంటూనే రాష్ట్రవ్యాప్తంగా కాపు కులస్తులపై బైండోవర్ కేసులు ఎందుకు నమోదు చేస్తున్నారని ప్రశ్నించారు. రిజర్వేషన్ల కోసం ఆందోళనలు, ధర్నా చేయబోమని అలా చేస్తే అందుకు బాధ్యత వహిస్తామంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాపులతో రాయించుకుంటున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. […]
కాపుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వైసీపీ నేత బొత్ససత్యనారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు నీచరాజకీయాల కోసం కుల రాజకీయాలను రెచ్చగొడుతున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కాపులు శాంతపరులు, అమాయకులని ఒక వైపు అంటూనే రాష్ట్రవ్యాప్తంగా కాపు కులస్తులపై బైండోవర్ కేసులు ఎందుకు నమోదు చేస్తున్నారని ప్రశ్నించారు. రిజర్వేషన్ల కోసం ఆందోళనలు, ధర్నా చేయబోమని అలా చేస్తే అందుకు బాధ్యత వహిస్తామంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాపులతో రాయించుకుంటున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇలా చేయడం ద్వారా కాపులను సంఘవిద్రోహకశక్తులుగా చిత్రీకరిస్తున్నారని బొత్స మండిపడ్డారు.
ఆర్ కృష్ణయ్యను వెనుక ఉండి రెచ్చగొడుతుందని చంద్రబాబేనని ఆరోపించారు. తెలంగాణ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణయ్య అదే రాష్ట్రంలో 26 కులాలను బీసీల జాబితా నుంచి తొలగిస్తే అప్పుడెందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని నిలదీశారు. కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ధర్నాలు ఆందోళనలు చేయడం తప్పంటున్న చంద్రబాబు…అదే సొంత పార్టీ ఎమ్మెల్యే కృష్ణయ్య కలెక్టరేట్ ముందు ఆందోళనకు పిలుపునిస్తే ఎందుకు నిలువరించలేదని నిలదీశారు బొత్స. చంద్రబాబు కుటిల రాజకీయాల్లో ఇదంతా ఒక భాగం కాదా అని ప్రశ్నించారు.
తూర్పుగోదావరి ఎస్పీ తీరును బొత్స తీవ్రంగా తప్పుపట్టారు. జిల్లాల్లోకి బయటివారు ఎవరూ రావద్దంటూ ఎలా ఆదేశాలు జారీ చేస్తారని ప్రశ్నించారు. పెళ్లిళ్లు, చావులు, పుట్టుకలు ఉండవా.. వాటికి కూడా హాజరు కాకూడదా అని నిలదీశారు. రాచరికం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తారా? అని మండిపడ్డారు. కాపుల సభకు అనుమతిచ్చామని, సహకరించాలని చంద్రబాబు చెబుతుంటే.. జిల్లా ఎస్పీ మాత్రం సభకు తాము అనుమతి ఇవ్వలేదని చెప్పడాన్ని గుర్తు చేశారు. ఈ రెండింటిలో ఏది నిజమో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.
Click on image to Read