అజ్ఞాతంలోకి వెళ్లిన జేసీ
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జిల్లా పోలీసులకు మధ్య వివాదం ముదిరింది. ప్రభాకర్ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనకు కేటాయించిన ఇద్దరు గన్‌మెన్లను వెనక్కు పంపించి అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జేపీ ప్రభాకర్ రెడ్డి అనుచరులకు పోలీసులు ఇటీవల పెయిడ్ గన్‌మెన్‌లను కేటాయించారు. అయితే పెయిడ్ గన్‌మెన్‌లను కేటాయించడంపై జేసీ అభ్యంతరం తెలిపారు. అనుచరులకు న్యాయం చేయాలని కోరారు. అయితే పోలీసు అధికారుల నుంచి స్పందన లేదు. ప్రభాకర్ రెడ్డి పదేపదే విజ్ఞప్తి చేసినా ఫలితం […]
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జిల్లా పోలీసులకు మధ్య వివాదం ముదిరింది. ప్రభాకర్ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనకు కేటాయించిన ఇద్దరు గన్‌మెన్లను వెనక్కు పంపించి అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జేపీ ప్రభాకర్ రెడ్డి అనుచరులకు పోలీసులు ఇటీవల పెయిడ్ గన్‌మెన్‌లను కేటాయించారు. అయితే పెయిడ్ గన్‌మెన్‌లను కేటాయించడంపై జేసీ అభ్యంతరం తెలిపారు. అనుచరులకు న్యాయం చేయాలని కోరారు. అయితే పోలీసు అధికారుల నుంచి స్పందన లేదు. ప్రభాకర్ రెడ్డి పదేపదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆగ్రహించిన ప్రభాకర్ రెడ్డి తనకు కూడా గన్‌మెన్‌లు అవసరం లేదని వెనక్కు పంపించారు. వారం రోజుల నుంచి పోలీసులకు, జేసీకి మధ్య వివాదం నడుస్తోంది. పోలీస్ ఉన్నతాధికారులు జేసీ మాట వినకపోవడానికి వెనుక అధికార పార్టీకే చెందిన నేతల హస్తముందని భావిస్తున్నారు. జేసీ బ్రదర్స్ టీడీపీలో ఉన్నప్పటికీ వారి విషయంలో వివక్ష కొనసాగుతోందన్న అభిప్రాయం ఉంది. పోలీసులు, జేసీ మధ్య వివాదం ఇంకెంత దూరం పోతుందో చూడాలి.
Click on Image to Read: