కాపు గర్జన- రైలుకు నిప్పు, బోగీలు దగ్ధం

#ఆందోళన విరమించిన ముద్రగడ- సోమవారం సాయంత్రం వరకు గడువు# కాపు గర్జన సభ తర్వాత పరిణామాలు ఉద్రిక్తతంగా మారాయి. వేలాది మంది కాపులు రైలు పట్టాలపై, జాతీయ రహదారిపై బైఠాయించారు. వేలాది మంది ఒక్కసారిగా పట్టాలపైకి రావడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. కొందరు ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టారు.  బోగీలు, ఇంజన్ పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు పెద్దెత్తున చెలరేగాయి. తుని రూరల్ పోలీస్ స్టేషన్ పైనా దాడి చేశారు. పీఎస్ […]

Advertisement
Update:2016-01-31 12:23 IST

#ఆందోళన విరమించిన ముద్రగడ- సోమవారం సాయంత్రం వరకు గడువు#

కాపు గర్జన సభ తర్వాత పరిణామాలు ఉద్రిక్తతంగా మారాయి. వేలాది మంది కాపులు రైలు పట్టాలపై, జాతీయ రహదారిపై బైఠాయించారు. వేలాది మంది ఒక్కసారిగా పట్టాలపైకి రావడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. కొందరు ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టారు. బోగీలు, ఇంజన్ పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు పెద్దెత్తున చెలరేగాయి. తుని రూరల్ పోలీస్ స్టేషన్ పైనా దాడి చేశారు. పీఎస్ కు నిప్పుపెట్టారు. పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు.

ప్రయాణికులను దింపేసి బోగీలకు నిప్పుపెట్టారు. ముద్రగడకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన పోలీస్ అధికారులపైనా ఆందోళనకారులు తిరగబడ్డారు. దీంతో వారు కూడా వెనుదిరిగారు. రాత్రి ముద్రగడ ఆందోళన విరమించారు. సోమవారం సాయంత్రం లోపు రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయకుంటే అమరణ దీక్షకు దిగుతానని ప్రకటించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News