కాపు గర్జనలో తీవ్ర నిర్ణయం- రైలు పట్టాలపైకి కాపులు

#ఆందోళన విరమించిన ముద్రగడ- సోమవారం సాయంత్రం వరకు గడువు# తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహిస్తున్న కాపు గర్జన సభ తీవ్ర నిర్ణయం తీసుకుంది. రైలు పట్టాలపై ధర్నాకు దిగారు. సాధారణంగా సభ జరుగుతుందని భావించినా, కాపు నేత ముద్రగడ పద్మనాభం మాత్రం తన తీవ్రమైన నిర్ణయాన్ని సభ వేదిక నుంచే ప్రకటించారు. అటో ఇటో తేల్చుకునేందుకే నేడు ఈ సభ నిర్వహించామని ఇక్కడి నుంచి నేరుగా రైలు పట్టాలపైకి, రోడ్లపైకి వెళ్లాలని కాపులకు పిలుపునిచ్చారు. దీంతో వేలాది మంది కాపులు […]

Advertisement
Update:2016-01-31 09:57 IST

#ఆందోళన విరమించిన ముద్రగడ- సోమవారం సాయంత్రం వరకు గడువు#

తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహిస్తున్న కాపు గర్జన సభ తీవ్ర నిర్ణయం తీసుకుంది. రైలు పట్టాలపై ధర్నాకు దిగారు. సాధారణంగా సభ జరుగుతుందని భావించినా, కాపు నేత ముద్రగడ పద్మనాభం మాత్రం తన తీవ్రమైన నిర్ణయాన్ని సభ వేదిక నుంచే ప్రకటించారు. అటో ఇటో తేల్చుకునేందుకే నేడు ఈ సభ నిర్వహించామని ఇక్కడి నుంచి నేరుగా రైలు పట్టాలపైకి, రోడ్లపైకి వెళ్లాలని కాపులకు పిలుపునిచ్చారు. దీంతో వేలాది మంది కాపులు పక్కనే ఉన్న రైలు పట్టాలపై ఆందోళనకు దిగారు. ముద్రగడ పద్మనాభం స్వయంగా రైలుకు అడ్డంగా కూర్చున్నారు.

బీసీల్లోకి కాపులను చేరుస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవోలు విడుదల చేసేంత వరకు ఇంటి మొహం చూడకూడదని ముద్రగడ పిలుపునిచ్చారు. 15 నిమిషాల పాటు ప్రసంగించిన ముద్రగడ ”పదండి పట్టాలపైకి వెళ్దామంటూ ” ప్రసంగాన్ని ముగించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లి రైలు పట్టాలపై కూర్చుకున్నారు. రాత్రి ముద్రగడ ఆందోళన విరమించారు. సోమవారం సాయంత్రం లోపు రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయకుంటే అమరణ దీక్షకు దిగుతానని ప్రకటించారు.

Click on Image to read

Tags:    
Advertisement

Similar News