ముద్రగడతో వైసీపీకి విబేధాలా?

ఈనెల 31న తూర్పుగోదావరి జిల్లా తునిలో తలపెట్టిన కాపు గర్జన సభకు తమ పార్టీ మద్దతు ఉంటుందని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. సభకు తామూ తరలివెళ్తామన్నారు. సభ నిర్వాహణలో కీలక పాత్ర పోషిస్తున్న ముద్రగడ పద్మనాభంతో వైసీపీకి రాజకీయపరమైన విబేధాలున్నాయని.. అయినప్పటికీ కాపుల సంక్షేమం దృష్ట్యా సభకు మద్దతు తెలుపుతున్నామన్నారు. కాపులవి గొంతెమ్మ కోర్కెలు కావన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలనే నెరవేర్చాల్సిందిగా కోరుతున్నారన్నారు. అధికారంలోకి వస్తే కాపులను బీసీల్లో చేర్చడంతో పాటు, […]

Advertisement
Update:2016-01-29 08:13 IST

ఈనెల 31న తూర్పుగోదావరి జిల్లా తునిలో తలపెట్టిన కాపు గర్జన సభకు తమ పార్టీ మద్దతు ఉంటుందని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. సభకు తామూ తరలివెళ్తామన్నారు. సభ నిర్వాహణలో కీలక పాత్ర పోషిస్తున్న ముద్రగడ పద్మనాభంతో వైసీపీకి రాజకీయపరమైన విబేధాలున్నాయని.. అయినప్పటికీ కాపుల సంక్షేమం దృష్ట్యా సభకు మద్దతు తెలుపుతున్నామన్నారు. కాపులవి గొంతెమ్మ కోర్కెలు కావన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలనే నెరవేర్చాల్సిందిగా కోరుతున్నారన్నారు. అధికారంలోకి వస్తే కాపులను బీసీల్లో చేర్చడంతో పాటు, కాపుల సంక్షేమానికి ఐదు వేల కోట్లు ఇస్తామన్న చంద్రబాబు ఇప్పుడెందుకు స్పందించడం లేదని అంబటి ప్రశ్నించారు. కాపులను మరోసారి మోసగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని రాంబాబు ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News