బాబునే ఉరికించాం.. నీవెంత.. తొక్కేస్తాం: కేటీఆర్‌

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో మాటల వేడి పెరిగింది. నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్‌ టీడీపీపై నిప్పులు చెరిగారు. రాజేంద్రనగర్‌, అత్తాపూర్, మైలార్‌దేవ్‌పల్లిలో ప్రచారం నిర్వహించిన కేటీఆర్ రాజేంద్రనగర్‌ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారంటే” రౌడీలను, గుండాలను తొక్కిపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం ఇది. టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్ జాగ్రత్త. గుండాగిరి చేస్తే ఏం చేయాలో మాకు తెలుసు. నీ కల్లు దుకాణాలు, దొంగ దందాలు […]

Advertisement
Update:2016-01-27 16:15 IST

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో మాటల వేడి పెరిగింది. నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్‌ టీడీపీపై నిప్పులు చెరిగారు. రాజేంద్రనగర్‌, అత్తాపూర్, మైలార్‌దేవ్‌పల్లిలో ప్రచారం నిర్వహించిన కేటీఆర్ రాజేంద్రనగర్‌ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారంటే” రౌడీలను, గుండాలను తొక్కిపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం ఇది. టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్ జాగ్రత్త. గుండాగిరి చేస్తే ఏం చేయాలో మాకు తెలుసు. నీ కల్లు దుకాణాలు, దొంగ దందాలు అన్నీ బయటపెడుతాం. ఎవరికీ భయపడం. వాళ్ల నాయకుడు చంద్రబాబునే ఉరికిచ్చినం.. ఆంధ్రకు వెళ్లగొట్టాం. ప్రకాశ్‌ గౌడ్ ఓ లెక్కనా!” అని కేటీఆర్ అన్నారు. గాడిదలకు గడ్డివేసి…ఆవును పాలు ఇమ్మంటే ఇస్తదా? అని ప్రజలను ప్రశ్నించారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ని కాదని ఇతరులకు ఓటువేస్తే అభివృద్ధి తీరు కూడా అలాగే ఉంటుందన్నారు కేటీఆర్. లోకేష్‌పైనా కేటీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

గ్రేటర్‌లో గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని లోకేష్ చెప్పడాన్ని కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ గురించి ఆలోచించడం మానేసి ముందు అమరావతి సంగతి చూసుకోండి అని అన్నారు. కేంద్రం వద్ద అంత పలుకుబడే ఉంటే అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి నిధులెందుకు తెచ్చుకోవడం లేదని ప్రశ్నించారు. అమరావతికి ప్రధాని మోదీ తట్టెడు మట్టి… లొట్టెడు నీళ్లు మాత్రమే తెచ్చారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Click on Image to Read

 

 

 

Tags:    
Advertisement

Similar News