దేశానికే అవమానం

రోహిత్ ఆత్మహత్య ఘటన దేశానికే అవమానమని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. హెచ్‌సీయూలో ఆయన పర్యటించారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపారు. మెరిట్ ఆధారంగా సీటు సంపాదించిన రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం దేశానికే అవమానమన్నారు. వర్శిటీలో ఏం జరిగిందో తెలుసుకోకుండా దత్తాత్రేయ నేరుగా కేంద్ర మానవవనరుల శాఖకు లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు. ఏబీవీపీ వేధింపుల వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారని కేజ్రీ ఆరోపించారు. యూనివర్శిటీలో ఏబీవీపీ నాయకుడు సునీల్ కుమార్పై ఏఎస్ఏ విద్యార్థులు దాడి చేయలేదన్నారు. రోహిత్ […]

Advertisement
Update:2016-01-21 06:03 IST

రోహిత్ ఆత్మహత్య ఘటన దేశానికే అవమానమని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. హెచ్‌సీయూలో ఆయన పర్యటించారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపారు. మెరిట్ ఆధారంగా సీటు సంపాదించిన రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం దేశానికే అవమానమన్నారు. వర్శిటీలో ఏం జరిగిందో తెలుసుకోకుండా దత్తాత్రేయ నేరుగా కేంద్ర మానవవనరుల శాఖకు లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు. ఏబీవీపీ వేధింపుల వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారని కేజ్రీ ఆరోపించారు. యూనివర్శిటీలో ఏబీవీపీ నాయకుడు సునీల్ కుమార్పై ఏఎస్ఏ విద్యార్థులు దాడి చేయలేదన్నారు. రోహిత్ ఆత్మహత్యకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పేరును చేర్చాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. స్టూడెంట్స్ కు స్మృతి ఇరానీ క్షమాపణ చెప్పాలని అన్నారు.

Tags:    
Advertisement

Similar News