రోహిత్ మృతికి కారణం వారే!

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మృతి అంశం దేశాన్ని కుదిపేస్తోంది. రోహిత్‌ మరణంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. రోహిత్‌ది ముమ్మాటికి హత్యేనని ఆయన అన్నారు. ఇదో సామాజిక హత్య అని అభివర్ణించారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వల్లే రోహిత్ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. వెంటనే వారిని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఘటనపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలన్నారు. మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయవతి తన ప్రతినిధులను హెచ్‌సీయూకు […]

Advertisement
Update:2016-01-19 06:21 IST

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మృతి అంశం దేశాన్ని కుదిపేస్తోంది. రోహిత్‌ మరణంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. రోహిత్‌ది ముమ్మాటికి హత్యేనని ఆయన అన్నారు. ఇదో సామాజిక హత్య అని అభివర్ణించారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వల్లే రోహిత్ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. వెంటనే వారిని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఘటనపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలన్నారు. మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయవతి తన ప్రతినిధులను హెచ్‌సీయూకు పంపారు. ఘటనపై వారు ఆరా తీశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు బీఎస్పీ మద్దతు తెలిపింది.

Tags:    
Advertisement

Similar News