తండ్రి ఉగ్రవాది- కొడుకు చదువులో టాప్!
కరడుగట్టిన ఉగ్రవాది కడుపున పుట్టిన వాడు ఉగ్రవాది ఎందుకు కావాలి. అతడు మంచి విద్యావంతుడు అయితే. అవును అదే జరిగింది. భారత పార్లమెంట్ పై దాడికి పాల్పడిన టెర్రరిస్ట్ అఫ్జల్ గురు కుమారుడు గాలిబ్ గురు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈపేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దేశద్రోహిగా, ఉగ్రవాదిగా అఫ్జల్ గురూ చెడ్డపేరు తెచ్చుకుంటే కొడుకు గాలిబ్ గురు మాత్రం చదువులో రాణించి అందరి మన్ననలు పొందుతున్నాడు. జమ్మూ కాశ్మీర్ లోని పూల్వానా జిల్లా […]
Advertisement
కరడుగట్టిన ఉగ్రవాది కడుపున పుట్టిన వాడు ఉగ్రవాది ఎందుకు కావాలి. అతడు మంచి విద్యావంతుడు అయితే. అవును అదే జరిగింది. భారత పార్లమెంట్ పై దాడికి పాల్పడిన టెర్రరిస్ట్ అఫ్జల్ గురు కుమారుడు గాలిబ్ గురు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈపేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దేశద్రోహిగా, ఉగ్రవాదిగా అఫ్జల్ గురూ చెడ్డపేరు తెచ్చుకుంటే కొడుకు గాలిబ్ గురు మాత్రం చదువులో రాణించి అందరి మన్ననలు పొందుతున్నాడు. జమ్మూ కాశ్మీర్ లోని పూల్వానా జిల్లా అవాన్జిపోరా ప్రాంతంలో నివసిస్తున్న గాలిబ్ గురు ప్రస్తుతం టెన్త్ క్లాస్ పూర్తి చేశాడు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన స్కూల్ ఎగ్జామినేషన్స్ లో గాలిబ్ గురు 500 మార్కులకు 474 మార్కులతో 95శాతం మెరిట్ తో ఏ1 గ్రేడ్ సాధించాడు.
చదువుల్లో రాణిస్తున్న గాలిబ్ ను చూసి నెటిజన్లు సోషల్ మీడియాలో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తండ్రి అఫ్జల్ గురు తాను ఇస్లాంపై పీహెచ్ డీ చేయాలని కలలు కన్నారని.. తాను మాత్రం కార్డియాలజిస్ట్ కానీ, న్యూరాలజిస్ట్ కానీ అవుతానని గాలిబ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. పార్లమెంట్ పై దాడికి పాల్పడిన అఫ్జల్ గురుని 2013 ఫిబ్రవరి 9న ఉరి తీశారు. తండ్రి మరణించి మూడేళ్ళు గడిచింది. పార్లమెంట్ పై దాడి జరిగినపుడు గాలిబ్ గురుకు పది నెలలు. ఆతర్వాత కాలంలో అతనికి తండ్రి ఎందుకు జైల్లో ఉన్నాడన్న విషయం కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారు కుటుంబ సభ్యులు. అయితే ఇటీవల అప్జల్ గురును ఉరి తీసినపుడు పత్రికల్లో వార్తల ఆధారంగానే తండ్రి చేసిన నేరం గురించి తెలిసిందని గాలిబ్ తెలిపాడు. చదువులో చురుకైన విద్యార్దిగా ఉండడానికి అతని తల్లి ప్రోత్సాహం కారణమని టీచర్లు అంటున్నారు. గాలిబ్ గురు అందరిలా మంచి జీవితం పొందాలన్నదే తన లక్ష్యమని తల్లి చెప్పింది.
Advertisement